హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: నేటి నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడంటే..?

Tirumala: నేటి నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడంటే..?

నేటి నుంచి తిరుచనూరులో పవిత్రోత్సవాలు

నేటి నుంచి తిరుచనూరులో పవిత్రోత్సవాలు

Tirumala: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 12 రోజుల పాటు మూత పడనుంది.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు..? ఆలయంలో ఏం చేయనున్నారు. మరోవైపు నేటి నుంచి తిరుచానూరులో పవిత్రత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అంకురార్పణ కూడా జరిగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  Tirumala: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు నేటి నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అయితే ఉత్సవాతు నిర్వహించడం వెనుక కారణం ఏంటో తెలుసా..? 

  ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది కారణంగా గానీ పొరపాటున కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఈ తప్పుల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, ప‌విత్ర అధివశం నిర్వ‌హించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

  ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ఇవాళ పవిత్రప్రతిష్ఠ నిర్వహిస్తారు. రేపు అంటే 9వ తేదీని పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు 750 రూపాయలు చెల్లించి ఒక‌రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు

  ttd, tirumala, tirupati, angapradakshinam, ttd tickets, టీటీడీ, తిరుమల, <a href='https://telugu.news18.com/tag//Tirupati/'><h5 class=తిరుపతి , శ్రీవారు, వెంకటేశ్వరస్వామి, అంగప్రదక్షిణ టికెట్లు" width="1600" height="1600" /> మరోవైపు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, 300 రూపాయల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

  అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.  

  ఈ కార‌ణంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నాలతో పాటు.. వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ర‌క్ష‌ణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శ‌నంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

  న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అందుకే ఆ సమయంలో అన్ని రకాల సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

  గ్రహణకాలం అంటేనే సకల దేవతామూర్తుల శక్తులు తగ్గుతాయనేది హిందూ సంప్రదాయంలో నమ్మకం. పాటీజీవీ ఎనర్జీ పూర్తిగా తొలగి నెగెటివ్ ఎనేర్జి అధికంగా ఉండే సమయం గ్రహణకాలంగా పిలుస్తారు. అదే సమయంలో అతిలోహిత కిరణాలూ భూమిని తాకుతాయని.. సైన్స్ చెపుతోంది. గ్రహణ కాలంలో దేశంలోని అన్ని ఆలయాలు మూసివేయడం ఆనవాయితీ.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు