హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Alert to Devotees: నేరుగా భక్తులకే స్వామి సేవ చేసే అవకాశం.. ఈ నెల 11 నుండి శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు..

Alert to Devotees: నేరుగా భక్తులకే స్వామి సేవ చేసే అవకాశం.. ఈ నెల 11 నుండి శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు..

తిరుమల వైభవోత్సవాలు

తిరుమల వైభవోత్సవాలు

Alert to Devotees: తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి. అయితే స్వామి వారి వాహన సేవలను చూసే భాగ్యం అయిపోయిందని చాలామంది చింతిస్తూ ఉంటారు. అలాంటి వారికి అలర్ట్.. నేగా స్వామి వారికి సేవ చేసే అవకాశం భక్తులకు కల్పిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Alert to Devotees: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వర‌స్వామి (Lord Venkateswara Swamy) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా సాగాయి. రోజుకు రెండు పూటలా వివిధ వాహనా సేవల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు.. ఆయన రూపాన్ని దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల ఫలం అన్నది భక్తుల నమ్మకం అందుకే.. ఈ బ్రహ్మోత్సవాలకు.. ఊహించని స్థాయిలో భారీగా తిరుమల (Tirumala) కు భక్తులు పోటెత్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు.. తిరుమ‌ల‌లో నిత్య, వార‌సేవ‌లు, ఉత్సవాలు రంగ రంగ వైభవంగా ఉంటాయి. ఆ సేవలను చూస్తే జన్మ ధన్యమైనట్టే అంటారు భక్తులు.. కానీ తిరుమల వెళ్లి స్వామివారిని అలా దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే ఈ ఉత్సవాలకు వెళ్లడం అంత ఈజీ కాదు. కానీ స్వామి వారి సేవల్లో పాల్గొనాలని అంతా కోరుకుంటారు. అలాంటి వారి అందరికి అవకాశం కల్పిస్తూ.. దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్స‌వాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) చెప్పారు.

  ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్స‌వాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌ ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ ఉత్స‌వాలను జరపనున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ ఉత్సవాల‌కు అంకురార్పణ జరగనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు నిత్య కైంక‌ర్యాలు నిర్వహిస్తామ‌ని.. తిరుమలలో ఎలా సేవలు జరుగుతాయో అలాగే వీటిని నిర్వహిస్తామని తెలిపారు.

  ఇక వార‌పు సేవ‌ల్లో భాగంగా అక్టోబ‌రు 11న వ‌సంతోత్సవం, 12న స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, 13న తిరుప్పావ‌డ‌, 14న నిజ‌పాద ద‌ర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌నివాస క‌ల్యాణం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి శీవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాల‌ని సుబ్బారెడ్డి కోరారు. ఇదే నెలలో ఏజ‌న్సీ ప్రాంతాలైన అన‌కాప‌ల్లి, అర‌కు, రంప‌చోడ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఇక డిసెంబ‌రులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జ‌న‌వ‌రిలో ఢిల్లీలో శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు నిర్వహిస్తామ‌న్నారు.

  ఇదీ చదవండి : మీరు మారిపోయారు.. అవును నిజమే.. ఆయన ఈయనేనా అంటూ ఆశ్చర్యం

  ఈ వైభవోత్సవాలతో పాటు.. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన .. కార్తీక మాసంలో విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్స‌వాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నార. అలాగే ఉత్తరాయ‌ణంలో చెన్నైలోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యం, జ‌మ్మూలోని శ్రీవారి ఆల‌యాల‌కు మ‌హాసంప్రోక్షణ జరపాలని నిర్ణయించారు. అహ్మదాబాద్ న‌గ‌రంలో శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి గుజ‌రాత్‌ ప్రభుత్వం 5 ఎక‌రాల స్థలం ఇచ్చింద‌ని, త్వర‌లో భూమిపూజ చేస్తామ‌ని చెప్పారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hyderabad, Tirumala, Tirumala Temple, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు