GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
పరిమాణంలో సూక్ష్మ రూపంలో ఉన్న జీవులని చూస్తే మనకు ఎలాంటి భయం ఉండదు. పెద్ద మొత్తంలో ఒకేసారి దాడి చేస్తే మనుసులైన వెనకడుగు వెయ్యక తప్పదు. చీమల ముంచి ఈగల వరకు ఒకటి రెండు అయితే....వాటిని ఈజీగా తరిమేయొచ్చు. అదే కొన్ని వందల సంఖ్యలో చీమలు దాడి చేస్తే చిన్న చిన్న ప్రాణుల నుంచి భారీ కాయం కలిగిన ఏనుగుల వరకు వాటికి దాసోహం అనాల్సిందే. టాలీవుడ్ లో విజువల్ వండర్ గా తెరెకెక్కిన రాజమౌళి ఈగ సినిమా ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధించింది. దర్శకదీరుడు జక్కన సినిమాలో ఆ ఈగ చేసే విన్యాసాలకు విజిల్స్ పడ్డాయి. ఆ సినిమాలో విలన్ పై ఈగ పగ తీర్చుకునే సన్నివేశాలు నిజజీవితంలో అసాధ్యమైనప్పటికీ..., ఆంధ్రప్రదేశ్ లో ఓ రెండు గ్రామాలను ఈగలు వణికిస్తున్నాయి. ఈగలు చూస్తేనే ఆ గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు. ఇంట్లో కూర్చున్నా, వంట చేస్తున్నా.. ఆఖరికి భోజనం చేసే స్వచ్ఛ కూడా వారికి లేకుండా పోతోందంటే ఈగలు వారిపై ఎంతగా పగబట్టాయో అర్ధమవుతుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొళ్లపల్లె కొంగనపల్లెలో ఈగల బెడద మరీ ఎక్కువైంది. అసలే ఈగలు పొదిగే సీజన్ కావడం ఈ కాలంలో వాటి సంఖ్య అధికంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 20 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఊళ్లోని ప్రతి ఇంట్లోనూ కుప్పలు కుప్పలుగా ఈగలు తిష్టవేశాయి. ఒక్క ఈగ గుయ్ అంటేనే చెవులు మోతెక్కిపోతాయి. అలాంటిది మందలు మందలు ఈగలు జనంమీద పడిపోతుంటే బెంబేలెత్తిపోతున్నారు.
ఈగల బెడదతో కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిద్ర మానుకొని మరీ వాటిని తరమాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈగలు ఆ గ్రామంలో అత్యధిక సంఖ్యలో రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ఇరు గ్రామాలకి చుట్టూపక్కల కోళ్లను పెంచే ఫార్మ్స్ ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే దుర్గంధానికి నానా అవస్థలు పడుతున్నామని స్థానికులంటున్నారు. కోళ్ల ఫామ్ నుంచి వచ్చే వ్యర్థాలు ఊరి చుట్టుపక్కల వేయడంతో ఈగల బెడద ఎక్కువైందని ఆరోపిస్తున్నారు.
స్థానికులు తినే ఆహారం, తాగే నీరు ఇలా ఎక్కడ చూసినా ఈగలే దర్శనమిస్తుండటంతో అవి తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి కోళ్ల ఫారం నుండి వచ్చే దుర్గంధం, ఈగల బెడద నుండి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati