TIRUPATI BE CARE FULL ON CYBER CHEATING IF OPEN UNKNOWN LINKS WILL BANK BALANCE NILL THESE TIPS MUST FALLOW NGS TPT NJ
Cyber Crime: ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. సైబరర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే.. ఇలా చేయండి
ప్రతీకాత్మకచిత్రం
Cyber Crieme: ఈ రోజుల్లో అందరి చేతుల్లోకి మొబైల్ వచ్చేసింది. అసలు సెల్ ఫోన్ లేని జీవితం లేదు అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ప్రతి అవసరానికీ ఫోన్ ను వాడక తప్పడం లేదు. అయితే డిమాండ్ ను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఏదో ఒకపేరుతో లింకులు పంపుతూ.. వారి జీవితాలను తల్లకిందులు అయ్యేలా చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. అయిత ఇలాంటి సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలి అంటే.. ఇలా చేయండి అంటున్నారు అధికారులు..
Cyber Crieme: చేతిలో మొబైల్ (Mobile) ఉంది కదా అని.. ఇష్టం వచ్చిన లింకులన్నీ ఓపెన్ చేస్తే మీ జీవితాలు తల్లకిందులు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్ లో ఇంటర్నెట్ వాడుకునేటప్పుడు.. మీ స్క్రీన్ మీద అనవసర లింక్‌లను పొరపాటున క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది. తెలియక పొరపాటున ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమవుతుంది. అంతేకాదు మీ మొబైల్లో ఉన్న ప్రైవేట్ డేటా మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ సైబర్ నేరాల (Cyber Crime) గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా…అక్కడక్కడా ఈ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
అలాంటివే ఇటీవల చిత్తూరు జిల్లాలో రెండు సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. చిత్తూరు మండలం ఎన్. ఆర్. పేటకు చెందిన ఓ యువతి ఒక వెబ్సైట్లో వరుడు కావాలంటూ తన పేరు రిజిస్టర్ చేసుకుంది. ఆ సైట్లో ఉన్న అమ్మాయి డిటైల్స్ చూసిన కేటుగాడు.. ఆ యువతి ప్రొఫైల్ లైక్ చేసి మాటమాట కలిపాడు. కొన్ని రోజుల్లోనే పరిచయం పెరిగింది. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అర్జెంట్‌గా డబ్బు కావాలని త్వరగా తిరిగిచ్చేస్తానని నమ్మించాడు. రూ.లక్షల్లో చెల్లించాక అతని ఫోన్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని ఓ మహిళ తమిళనాడుకు చెందన వ్యక్తిని నమ్మించింది. అనుమానం వచ్చినా కంపెనీ లాభాల బాటలో ఉన్నట్లు చూపించడంతో… విడతల వారీగా రూ.14.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఓ రోజు తనకు అర్జెంట్ అవసరం ఉందని కొంతడబ్బు తీసుకుంటానని చెప్పిన మరుక్షణం ఆ వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో మోసపోయానని గ్రహించి .. పోలీసులను ఆశ్రయించాడు. ఇలా ఈ రెండు కేసులే కాదు… ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఈ సైబర్ నేరాల ఉచ్చులో పడొద్దని పోలీసులు ప్రజలకు ప్రతి రోజు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు కాస్త ఆలోచనతో ఈజీ మనీకి ఆశపడకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సైబర్ వలలో ఫేస్బుక్ ఖాతాలు..! సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్బుమ్ ప్రస్తుతం మార్క్ జూకర్ బర్గ్ ఆధీనంలో ఉందో లేదో కానీ.. సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంది. అందరితో కనెక్ట్ అవ్వొచ్చని ఫేస్బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్లు సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. కాస్త సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులు మొదలు అధికారుల వరకు నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లకు డబ్బులు కావాలంటూ మెసెజ్‌లు పెడుతున్నారు. అంతేకాదు ఈ మధ్య ఈ-మెయిల్ స్వాపింగ్ కూడా మొదలుపెట్టారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని ప్రముఖ కాలేజీ, యూనివర్సిటీలకు చెందిన ప్రముఖుల మెయిల్ ఐడీను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి… అందులో పనిచేసే ఉద్యోగులకే డబ్బులు కావాలని మెయిల్ పెట్టారు.
ఇంటర్నెట్ లేనిదే ఈ రోజుల్లో ఏ పనులు కావడం లేదు. అంతలా మన జీవితంలో కలిసిపోయింది. అయితే దీన్ని వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. అనవసరపు లింక్‌లు, పాప్ అప్లు, ఓపెన్ చేయోద్దని.. అలా చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి మీ డిటైల్స్ మీరే ఇచ్చినట్లు అవుతుందంటున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల పాన్, ఓటీపీ, ఇతర వివరాలు ఎవ్వరికీ చెప్పకూడదు.. ఆర్థిక లావాదేవీలపై కాస్త అవగాహన పెంచుకోవాలి.
సైబర్ నేరాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి..! ఒకవేళ ఎవ్వరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైలెంట్‌గా ఉండకుండా ఫిర్యాదు చేయాలి. అలా చేస్తేనే సదరు నగదు ఖాతా లావాదేవీలు ఆపేసి మరో నేరం జరగకుండా చూడొచ్చంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ సైబర్ నేరాలకు సంబంధించి కొందరు నేరగాళ్లను అరెస్టు చేశామంటున్నారు. ఎలాంటి చిన్న ఘటన జరిగినా ప్రజలు సైబర్‌మిత్ర ఫోన్ నంబరు: 91212 11100కు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.