Home /News /andhra-pradesh /

TIRUPATI BANNERS TURNED HOT TOPIC IN TIRUAPTHI AS AMARAVATHI FARMERS PADAYATRA COMES TO AN END FULL DETAILS HERE PRN TPT

Amaravahti Padayatra: మీతో మాకు గొడవలొద్దు.. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం..

తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం

తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఒకే రాజధాని.. అదే అమరావతి (Amaravathi) మాత్రమే ఉండాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం తిరుపతి (Tirupathi) కి చేరుకున్న మహా పాదయాత్ర మంగళవారం అలిపిరి చేరుకోవడంతో సమాప్తం కానుంది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tiruapthi, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఒకే రాజధాని.. అదే అమరావతి (Amaravathi) మాత్రమే ఉండాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం తిరుపతి (Tirupathi) కి చేరుకున్న మహా పాదయాత్ర మంగళవారం అలిపిరి చేరుకోవడంతో సమాప్తం కానుంది. అలిపిరి వద్ద కొబ్బరి కాయలు కొట్టి పాదయాత్రను ముంగించనున్నారు అమరావతి రైతులు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. తిరుపతి లోని రామానాయుడు కల్యాణ మండపం నుంచి ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా రైల్వే స్టేషన్‌, కర్నాల వీధి, కృష్ణాపురం ఠాణా, ఎన్టీఆర్‌ విగ్రహం, రామచంద్ర పుష్కరిణి వద్దకు రైతుల మహా పాదయాత్ర చేరుకోనుంది. భోజనానంతరం రాములవారి గుడి, చిన్న బజారు వీధి, గాంధీరోడ్డు, నాలుగు కాళ్ల మండపం, నగరపాలక సంస్థ, తితిదే పరిపాలన భవనం, అన్నారావు సర్కిల్‌, హరేరామ హరే కృష్ణ గుడి, రుయా ఆస్పత్రి మీదుగా అలిపిరి పాదాల మండపం ముగియనుంది.

    అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు నేపథ్యంలో తిరుపతిలో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమరావతి రైతుల పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. పేరు, పార్టీ, ఇతర వివరాలేవీ లేకుండా ఆ ఫ్లెక్సిలను ఏర్పాటు చేయడం కలకలం రేపాయి. 'మీతో మాకు గొడవలు వద్దు... మీకు స్వాగతం.... మాకు మూడు రాజధానులు కావాలి - తిరుపతి ప్రజలు' అంటూ ఫ్లెక్సీలు తిరుపతిలో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి.

    ఇది చదవండి: ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..? ఎవరెంత చెల్లించాలంటే..!


    అది చూసిన అమరావతి రైతులే కాదు తిరుపతి ప్రజలు కూడా అవ్వాక్కవుతున్నారు. కొందరు తిరుపతి ప్రజలు ముందుకు వచ్చి తమకు అభివృద్ధి వికేంద్రీకరణే కావాలని..., ఒక్క రాజధాని వల్ల రాయలసీమ ప్రజలు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని అభివృద్ధి చేయడంతో ఉమ్మడి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి ఒకే రాజధానిగా అభివృద్ధి చేస్తే ఏపీ మరో మూడు ముక్కలుకాక తప్పదంటున్నారు.

    ఇది చదవండి: జగన్ బెయిల్ రద్దు అంశంలో కీలక పరిణామం.. ఏపీ సీఎంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

    అమరావతి రైతులు మాత్రం ఇది కేవలం అధికార వైసీపీ స్కెచ్ అని ఆరోపిస్తున్నారు. తమ పాదయాత్రకు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే అధికార పార్టీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని విమర్శిస్తున్నారు. తమను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసినా.., బెదిరింపులకు పాల్పడిన బయపకుండా పాదయాత్ర సాగిస్తూ వస్తున్నట్లు తెలిపారు. పాదయత్ర ముగింపు దశకు చేరుకోవడంతో మాపై వ్యతిరేకత వస్తుందని వైసీపీ యోచిస్తోందని.. ప్రజలు మాత్రం తమవైపే ఉన్నారన్నారు. మొత్తానికి ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారోగానీ రాజకీయా వర్గాల్లో మాత్రం తీవ్రచర్చనీయాంశమవుతున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Amaravathi, Andhra Pradesh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు