ఎవరైనా ఏదైనా అవసరం కోసం వస్తే వారి మీద పెత్తనం చేయడం చాలాసార్లు కనిపిస్తుంది. ఐతే మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని లేంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక బ్యాంక్ మేనేజర్ వెకిలి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఒంటరిగా తన కేబిన్ లోని పిలవడం.. మాట్లాడే వంకతో వారిని ఎక్కడబడితే అక్కడ తాకడం చేస్తున్నాడు. చాలా మంది మహిళలు తమకు లోన్ రాదేమోనన్న భయంతో మిన్నకుండిపోయారు. కానీ చేసిన పాపం ఊరికే ఉండదుకదా.. మూడో కన్న మనోడ్ని అడ్డంగా పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న నగేష్.. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. తన హోదా మరిచి వికృత చేష్టలకు దిగుతున్నాడు. లోన్ గురించి మాట్లాడాలి లోపలికి రండి అంటూ తన క్యాబిన్ కు పిలవడం అసభ్యంగా మాట్లాటమే కాకుండా వారి ప్రేవేట్ పార్ట్స్ ను తాకడం చేస్తున్నారు.
ఈ వికృత చేష్టల పర్వం చాలా రోజులుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది బాధితులు తమ పరువు పోతుందన్న భయంతో విషయాన్ని బయటకు చెప్పలేదు.. క్యాబిన్లో ఉన్న సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో నగేష్ వెకిలి చేష్టలు అందరికీ తెలిశాయి. గత ఏడాది జనవరిలో రికార్డైన ఆ వీడియో.., ఇటీవలే బయటకు వచ్చింది. సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ నగేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐతే నగేష్ వేధించిన వారిలో సీసీ ఫుటేజ్ లో ఉన్న మహిళతో పాటు చాలా మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బ్యాంక్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత మహిళల్లో ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఐతే బాధిత మహిళల బ్యాంక్ ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ బ్యాంక్ లో మేనేజర్ అయిన నగేష్... సిబ్బందికి, బ్యాంకుకు వచ్చేవారికి ఆదర్శంగా ఉండాలే తప్ప.. అవసరం కోసం వచ్చిన వారిని వేధించడాన్ని మహిళా సంఘాలు తప్పుబడుతున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పనిచేసే చోట, అవసరం కోసం వెళ్లిన చోట మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. వీటిని అరికట్టేందుకు చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందని పలువురు అంటున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు నేరుగా చర్యలు తీసుకుంటారా..? ఫిర్యాదు కోసం ఎదురుచూస్తారా..? అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.