Peddireddy Ramachandrareddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) తెలుగు రాష్ట్రాలను కుదిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ (Telangana) లో అధికార టీఆర్ఎస్ (TRS) నేత కవిత (Kavita) పై బీజేపీ నేతలు (BJP Leaders) తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీని సైతం ఆరోపణలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ కేసుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సతీమణి.. వైఎస్ భారతి (YS Bharathi) పేరు ఉంది అంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే భారతి పేరును తెరపైకి తెచ్చినా.. మంత్రులు ఆ స్థాయిలో ధీటుగా సమాధానం చెప్పడం లేదని జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వలేని వారికి పదవులు ఎందుకు.. త్వరలోనే అలాంటి మంత్రులను పక్కన పెట్టేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే..? మంత్రులు.. మాజీ మంత్రులు వరుస పెట్టి మీడియా ముందుకు వచ్చారు. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి (Minster Peddireddy Ramachandra Reddy) సైతం.. టీడీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇసుకపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇసుక కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చని.. దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇసుక విషయంలో అక్రమాలు అరికట్టేందుకు విజిలెన్స్ విభాగం పటిష్టంగా పనిచేస్తోందన్నారు..
అలాగే సీఎం జగన్ సర్కారు 100 శాతం ఎన్నికల హామీలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఆయన.. వైఎస్ భారతమ్మతో లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి బంధువులు లిక్కర్ స్కాం సూత్రధారులని.. కానీ ఉద్దేశపూర్వకంగా దీనిని వైఎస్ జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారని ఆయన ఆరోపించారు.
సిగ్గుమాలిన వ్యక్తులే ఇలా కుటుంబీకులపై ఆరోపణలు చేస్తారని ధ్వజమెత్తారు. తమపై రాజకీయాలు చేయండి ఎదుర్కొంటామని… వైఎస్ కుటుంబీకులను లాగితే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. దీనిపై ఆ ప్రభుత్వంతో పోరాడుతున్నామని.. అవసరం అయితే కేంద్రం దగ్గరే తగువు తేల్చుకుంటామన్నారు. ఈ బకాయిలు ఎగ్గొట్టడానికే 1700 కోట్లు తమకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోర్టును ఆశ్రయించిందని.. లీగల్గా ఎదుర్కొంటామన్నారు.
అలాగే ఈ నెల 22న సీఎం జగన్ కుప్పం వస్తున్నారని.. మూడో విడత చేయూత పథకంను సీఎం అక్కడే లబ్ధిదారులకు విడుదల చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పం వేదికపై నుంచే నుంచే.. మహిళలకు అందిస్తారని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Peddireddy Ramachandra Reddy, Ycp