• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI AP HIGHCOURT DISMISS TDP BJP PETITIONS ON TIRUPATI BY POLL ELECTIONS NGS

Tirupati by poll: టీడీపీ, బీజేపీలకు బిగ్ షాక్. ఉప ఎన్నిక ఫలితానికి లైన్ క్లియర్

Tirupati by poll: టీడీపీ, బీజేపీలకు బిగ్ షాక్. ఉప ఎన్నిక ఫలితానికి లైన్ క్లియర్

ఏపీ హైకోర్టు (ఫైల్)

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తేలేది ఎప్పుడో తెలుసా? తాజా కోర్టు తీర్పు ఫలితానికి ముందే టీడీపీ, బీజేపీలకు షాక్ ఇచ్చినట్టైంది. ఇప్పటిటికే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు కూడా గెలుపు ఎవరిది అన్నది స్పష్టం చేశాయి.

  • Share this:
    ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల ప్రకటనకు లైన్ క్లియర్ అయ్యింది. ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని.. ఇతర ప్రాంతాల నుంచి భారీగా దొంగ ఓటర్లను బస్పుల్లో తరలించి మరి అధికార పార్టీ రిగ్గింగుకు పాల్పడిందని టీడీపీ, బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా కోర్టును కూడా ఆశ్రయించారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం వరకు అయిన ఉప ఎన్నిక రద్దు చేయాలంటూ టీడీపీ కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఉప ఎన్నిక రద్దు చేయాలని అని దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టేసింది. ఈ సమయంలో ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. దీంతో అనుకున్న సమయానికే ఉప ఎన్నిక ఫలితం రానుంది. మే రెండున తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది.

    కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఉప ఎన్నిక రద్దవుతుందని ఇటు టీడీపీ, బీజేపీలు ఆశించాయి. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని.. అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులే దగ్గరుండి అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ, బీజేపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఎన్నిక జరిగిన రోజు సైతం చాలా చోట్ల దొంగ ఓటర్లను పట్టుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. బస్సుల్లో తమ మనుషులను తరలించామని చెబుతున్న ఎమ్మెల్యే చెవి రెడ్డి ఫోన్ సంభాషణను కూడా తమ ఫిర్యాదులో జత చేశారు. అక్రమాలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉండడంతో ఉప ఎన్నికను న్యాయం స్థానం రద్దు చేస్తుందని ఆ రెండు పార్టీలు భావించాయి. అయితే ఆ రెండు పార్టీలకు కోర్టు పెద్ద షాక్ అని చెప్పాలి.. ఈ సమయంలో ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు క్లియర్ గా చెప్పేసింది. దీంతో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై రెండు  పార్టీల్లో ఆలోచిస్తున్నాయి.

    మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం మే 2న వెలువడనుంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఇప్పటికే ఎవరు విజేత అన్నది చెప్పేశాయి. సాధరణంగా తిరుపతి పోలింగ్ కు ముందు, తరువాత కూడా వైసీపీ నేతలు చాలా థీమాగా కనిపిస్తున్నారు. తిరుపతిలో కచ్చితంగా తమకి 4 లక్షల పైనే మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ తరువాత కూడా.. తిరుపతిలో ఊహించని మెజార్టీతో గెలుస్తున్నామని అధికార పార్టీనేతలే ప్రకటనలు చేశారు. తాజా గా ఆరా సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీదే విజయం అని తేల్చేసింది. అధికార వైసీపీకి 63 శాతం ఓట్లు పడ్డాయని స్పష్టం చేసింది. అంటే వైసీపీ ఊహించినట్టే భారీ మెజార్టీని ఇక్కడ ఓటర్లను కట్టబెడతారని ఆ సంస్థ అంచనా వేసింది. గట్టి పోటీ ఇస్తుందని అంతా అచంనా వేసిన ప్రధాన ప్రతిపక్షానికి కేవలం  23 . 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై టీడీపీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికార వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు వేయించారని.. తిరుపతి అసెంబ్లీ పరిధి వరకు మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు అయినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

    ఇదీ చదవండి: తిరుపతిలో 63 శాతం ఓట్లతో ఆ పార్టీదే విజయం. ఆరా ఎగ్జిట్ పోల్ అంచనా

    ఇక తిరుపతి ఉప ఎన్నికపై కమలం పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలో గెలుపొంది ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ ఆశించింది. ముఖ్యంగా జనసేన తో పొత్తు, యువత, సామాజిక సమీకరణాలు బాగా కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. కనీసం గెలవకపోయినా సెకెండ్ ప్లేస్ అయితే తమదే అని స్థానికంగా లీడర్లు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వస్తుందని ఆశించింది. కానీ తిరుపతి  ఓటర్లు మాత్రం బీజేపీ ఊహించని షాక్ ఇచ్చారని ఆరా సంస్థ అంచనా వేసింది. ఆ పార్టీకి కేవలం కేవలం 7.34 శాతం ఓట్లే వస్తున్నట్టు చెప్పింది. ఇక కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్లు చెప్పింది
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు