TTD New Board: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం రద్దు..

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) హైకోర్టులో (High Court) మరోసారి షాక్ తగిలింది. టీటీడీ పాలకమండలి (TTD Board) నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) హైకోర్టులో (AP High Court) మరోసారి షాక్ తగిలింది. టీటీడీ పాలకమండలి (TTD New Board) నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రభుత్వం నూతన పాలకమండలి నియమించగా ప్రత్యేక ఆహ్వానితులుగా (TTD Board Special Invitees) 52 మందిని నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వల్ల భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. దీనితో ఏకీభవించిన కోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దేవాదాయ శాఖ చట్టానికి విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. టీటీడీ బోర్డులో 80 మంది కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండటం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. దీంతో హైకోర్టు రెండు జీవోలను రద్దు చేసింది.

  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నూతన బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. పాలకమండలి సభ్యులుగా పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, టంగుటూరి మారుతీ ప్రసాద్, మన్నె జీవన్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, ఎన్.శ్రీనివాసన్, రాజేష్ శర్మ, బోర సౌరభ్, మురంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, ఎపీ నందకుమార్, పాచిపాల సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కేతన్ దేశాయ్, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్ కేశవ్ నర్వేకర్, ఎమ్ఎన్ శశిధర్, అల్లూరి మల్లేశ్వరి, ఎశ్.శంకర్, ఎస్.ఆర్ విశ్వనాథ్ రెడ్డి, బుర్రా మధుసూధన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఎంపిక చేసింది.

  ఇది చదవండి: బెజవాడలో మరో ల్యాండ్ స్కామ్... మంత్రిపై ఆరోపణలు.. తెరవెనుక కథ నడిపిన ఓఎస్డీ..?


  అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ప్రకటించింది. ఇక పాలకమండలిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, , బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కు ఎక్స్ అఫీషియో ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.

  ఇది చదవండి: టీటీడీలో ముదురుతున్న జీడిపప్పు వివాదం.. వారి సహకారం లేకుండానే జరిగిందా..?


  అలాగే 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. ఈ జాబితాలో కుందవరపు శ్రీనివాస్ నాయుడు, రాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి, బద్వేలు సుబ్బారెడ్డి, కావేరి భాస్కర్ రావు, డాక్టర్ సంపత్ రవి నారాయణన్, మురళీ మహేశ్వర రాజు, రమేష్ శెట్టి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, యెలిషల రవి ప్రసాద్, బీరేంద్ర వర్మ, మహాసముద్రం దయాసాగర్ రెడ్డి, దుష్మంత్ కుమార్ దాస్, అమోల్ కాలే, రాధాకృష్ణ అదిగ, అర్.గోవింద హరి, నరేష్ కుమార్ అగర్వాల్, ప్రసాద్ వర్మ, సాముల రామ్ రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ రాజా, సిద్ధార్థ్ లాడే, గోవింద రాజులు, డాక్టర్ ఎన్.కన్నయ్య, జీఆర్ కృష్ణ, ఆతుకూరి ఆంజనేయులు, మంజునాథ్, డాక్టర్ టీఏ శరవణ, జి.రామచంద్రమూర్తి, దాట్ల రంగావతి, దాసరి కిరణ్ కుమార్, కోమటిరెడ్డి లక్ష్మి, శంభు ప్రసాద్ మహంత్, ముక్కా రూపానంద రెడ్డి, కుమార గురు,తాడిశెట్టి మురళీ, పిడా కృష్ణ ప్రసాద్, కుపేందర్ రెడ్డి, దాసరి వెంకట రామకృష్ణ ప్రసాద్, పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, చింతకుంట సత్యనారాయణ, పుట్టా ప్రతాప్ రెడ్డి, కాలిశెట్టి శివకుమార్, డెక్కారి జనార్ధన్ రెడ్డి, కట్టా సింగయ్య, విజయ్ కుమార్ గురూజీ, కేఎమ్ శివ శంకరాచారి, నాదెండ్ల సుబ్బారావు, ఆర్.గురునాథ్ రెడ్డి, దాశెట్టి సుబ్రహ్మణ్యం, దాసరి మురళీకృష్ణ, అవినాష్ గౌడ్ ఉన్నారు.
  Published by:Purna Chandra
  First published: