Home /News /andhra-pradesh /

YS Jagan at SZC: సదరన్ జోన్ కౌన్సిల్ భేటీలో జగన్ లేవనెత్తిన అంశాలివే.. అమిత్ షా ఏమన్నారంటే..!

YS Jagan at SZC: సదరన్ జోన్ కౌన్సిల్ భేటీలో జగన్ లేవనెత్తిన అంశాలివే.. అమిత్ షా ఏమన్నారంటే..!

అమిత్ షా తో సీఎం జగన్

అమిత్ షా తో సీఎం జగన్

తిరుపతిలో (Tirupathi) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం (Southern Zone Council Meeting) కొనసాగుతోంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రసంగించారు.

    తిరుపతిలో (Tirupathi) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం (Southern Zone Council Meeting) కొనసాగుతోంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రసంగించారు. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ వినిపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇతర అంశాలతో పాటు తమిళనాడుతో ముడిపడిన అంశాలను కూడా లేవనెత్తారు. ఏపీ నుంచి ముఖ్యంగా ఏడు అంశాలను వైఎస్ జగన్ ప్రస్తావించారు. విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోలేని సీఎం అన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని.. రెవెన్యూ లోటు భర్తీ చేయలేదన్నారు. పోలవరం విషయంలో సంవరించిన అంచనాలను ఆమోదించాలన్న సీఎం... 2013-14 అంచనాలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు.

    ఏపీకి తెలంగాణా విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన 6,015 కోట్ల బకాయిల విషయాన్ని సీఎం ప్రస్తావించారు. బకాయిలు ఇప్పించి నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం హామీల్లోని రాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం, కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, ఎడిపి రుణాన్ని గ్రాంటుగా మార్చే అంశాలను ప్రస్తావించారు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...


    తెలుగుగంగ నీటకి తమిళనాడు బకాయి ఉన్న 338 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎపి సముద్ర జలాల్లోకి తమిళనాడు నుంచి పిషింగ్ బోట్లు అక్రమంగా ప్రవేశించడాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కుప్పంలోని పాలారు నదిపై ఎపి నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై తమిళనాడు అభ్యంతరాలకు వివరణ ఇచ్చారు. జాతీయ పోలీస్ అకాడమీ తరహాలో ఎపిలో జాతీయ జైళ్ల అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

    ఇది చదవండి: కీలక నేతకు మరోసారి హ్యాండిచ్చిన జగన్.. ఆ మహిళా ఎమ్మెల్యేనే కారణమా..?



    2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజనకు సంబంధించి ఇప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగా. అనేక అంశాలు అలాగే అపరిష్కృతంగా ఉండడం వల్ల రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా అవి ప్రభావం చూపేలా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణని అన్నారు.  2014–15కు సంబంధించి కాగ్‌ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి మార్చి 31, 2015 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా ఉందన్నారు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయిందన్నారు.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఈ అవకాశం..


    జగన్ ప్రసంగంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కావని జాతీయ అంశాలని.. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తామన్నారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    తదుపరి వార్తలు