GT Hemanth Kumar, Tirupathi, News18
Tirumala: ఆనంద స్వరూపుడైన శ్రీ శ్రీనివాసుడు వైకుంఠాన్ని వీడి.. ఇల వైకుంఠం అయిన శేషాద్రి నిలయంలో అవతారా మూర్తిగా వెలిశారు. దుష్ట శిక్షణ - శిష్ట రక్షణార్థం కలియుగంలో వెలసిన స్వామివారి దర్శన భాగ్యం పూర్వ జన్మ సుకృతం అన్నది భక్తుల నమ్మకం. అందుకే ఎన్నిసార్లు దర్శించిన స్వామివారి రూపం క్షణాల్లో మరచిపోవడం ఆయన మహాత్యమే అంటారు. అందుకే శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శ్రీ వేంకటేశ్వరుడి (Sri Venkateswara swamy) ని దివ్యమంగళ స్వరూపాన్ని తనివితీరా దర్శిస్తారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించే పుణ్య క్షేత్రం కావడంతో మూడంచెల భద్రత ప్రమాణాలను పాటిస్తూ వస్తోంది టీటీడీ.
టీటీడీ విజిలెన్స్, పోలీస్, ఆక్టోపస్ తో సహా తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా.. ప్రమాదాలకు తావు లేకుండా ప్రత్యేమైన సీసీకెమెరాలను తిరుమల నలుమూలన అమర్చింది టీటీడీ (TTD). ఇందుకోసం ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
ఈ కంట్రోల్ సెంటర్ లో 24 గంటలు మూడు షిప్ట్‌లలో పనిచేస్తుంటారు. సీసీ కెమెరాల ద్వారా ఏ ప్రాంతంలో ఏంజరుగుతుందో అని జల్లెడ పడుతుంటారు. అనుమానితులు ఎవరు తారసపడ్డ వెంటనే పక్కనే ఉన్న విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేసి వారిని అదుపులోకి తీసుకొనేలా చేస్తారు. ఇక అందులోనే జంతువులు, క్రౌడ్ ను గుర్తంచి తోపులాట సాగకుండా ఉండేలా అత్యాధునిక సాఫ్ట్వేర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఇదీ చదవండి : పసుపు దళం పునరుత్తేజం అయ్యేనా? సెంటిమెంట్ లోకేష్ కు కలిసొచ్చేనా..?
తాజాగా సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూ వీడియో చక్కర్లు కొట్టింది. పలు ఇన్ స్టగ్రాం అకౌంట్లతో పాటుగా.. పలు యూట్యూబ్ చానెల్స్ లో స్వామి వారి ఆలయానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి.. ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టింది. స్వామి వారి ఆలయం హై సెక్యూరిటీ అయినా ఏరియల్ వ్యూ వీడియో ఇప్పుడు సోసియల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.. స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంది టీటీడీ. ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవాలి.
ఇదీ చదవండి: తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఒకే రోజు ఏడు వాహన సేవలు.. ప్రత్యేకత ఇదే
డ్రోన్ రైడర్ 1 (Dronerider1) అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టింగ్ తేదీ ప్రకారం గత నవంబర్ 13న అప్ లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. తరువాత అదే వీడియోని ఐకాన్ ఫాక్ట్స్/ ఐకాన్ (eyeconfacts/eyecon) అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 07 2023లో పోస్ట్ అయినట్లు డిస్క్రిప్షన్ లో కనపడుతోంది. ఇక గృహశ్రీనివాస (gruhasrinivasa) అనే ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో అదే వీడియోని పోస్ట్ చేసారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై కిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
దీంతో కిరణ్ పై IPC సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో గ్రుహ శ్రీనివాసా, ఐకాన్ ఫ్యాక్ట్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు చూపించినట్లు తెలుస్తొంది. టెంపుల్ సెక్యూరిటీ ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్వహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో మరో సమరం.. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న పార్టీలు
ఇక యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టగ్రాంలో అప్ లోడ్ అయిన వీడియోలను సైతం టీటీడీ తొలగించింది. ఇలాంటి వీడియోలు సామజిక మాధ్యమాలలో ఉండటం ద్వారా ఆలయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటను జరుగకుండా ప్రత్యేల చర్యలు చేపట్టనుంది. మరోమారు కేంద్ర భద్రత కమిటీ తిరుమలలో పర్యటించి భద్రతలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనం చేయాలాని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ మాత్రం నూతన పరిజ్ఞానాన్ని ఎప్పటికి అప్పుడు అందువాటులోకి తీసుకొస్తూ... మెరుగైన భద్రత అందిస్తోంది.
ఇదీ చదవండి : నెల్లూరు నుంచే పోటీ చేస్తా..? బతికినా, చచ్చినా సింహం లాగా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం యాంటీ డ్రోన్ సిస్టం అమలుకు కసరత్తు ప్రారంభించింది. చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్‌ఎడిఎస్)ను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి స్పష్టం చేసారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తో చర్చలు జరుపుతోంది టీటీడీ. భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి డ్రోన్ కెమెరాలు ఎగురాకుండా ఈ టెక్నాలిజీని అందుబాటులోకి తీసుకురానుంది. డ్రోన్స్ తిరుమలలో ఏ మూలన ఎగిరిన వెంటనే పసిగట్టే యాంటీ డ్రోన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే మరింత బలమైన సెక్యూరిటీ ఉన్న ఆలయంగా మారడం ఖాయమని చెప్తున్నారు నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Ttd news