Andhra Pradesh: ఈ ఆకు పసరుతో కరోనా ఖతం.., వైరస్ ను సవాల్ చేస్తున్న బ్రదర్స్

పులివెందులలో కరోనాకు ఆకుపసరు

కరోనాకు ఆయుర్వేద మందు పేరుతో ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు. ఆనందయ్య మందుకు మంచి రెస్పాన్స్ రావడంతో తాము కూడా వైరస్ ను తరమికొడతామంటున్నారు.

 • Share this:
  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనాకు ఆయుర్వేద మందుపైనే చర్చ జరుగుతోంది. ఎవరినోట విన్నా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేస్తున్న మందు మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై ఆయుష్ వైద్యులు అద్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఆనందయ్య బాటలోనే మరికొంత మంది కరోనాకు నాటు వైద్యం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. కరోనాను ఖతం చేయడానికి తమ దగ్గర సరైన వైద్యమందుని కడప జిల్లా పులివెందులకు చెందిన యాదాటి రామ గంగాధర్ యాదవ్, వివేకానంద యాదవ్ చెప్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లోనూ లక్షలాది మందికి తామ కుటుంబం పసరు వైద్యం చేసిందని.. ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ధీమాగా చెప్తున్నారు. తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే కరోనాను తరిమిడి కొడతామంటూ సవాల్ విసురుతున్నారు. గత ఏడాదిలో దాదాపు 3లక్షల మందికి కరోనా నివారణ మందును ఇచ్చామని.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నామంటున్నారు ఈ అన్నదమ్ములు.

  తాము ఇచ్చే మందు కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని.. వారికి కూడా మందు ఇచ్చామంటున్నారు. ఈ ఔషధం తీసుకున్నవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని చెప్తున్నారు. ఈ కుటుంబం ఐదు తరాలుగా వివిధ మూలికలతో నాటు వైద్యం అందిస్తోంది. ఇందులో భాగంగానే కరోనాకు కూడా మందును తయారు చేసినట్లు చెప్తున్నారు.

  పసరు మందు తయారు చేస్తున్న దృశ్యం

  ఇది చదవండి: ఏపీలో పెరుగుతున్న కరోనా రికవరీలు.. కారణం అదేనా..?


  ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినవారు ప్రాణాపాయ స్థితిలోనూ వచ్చి పసరు తీసుకొని పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని గంగాధర్, వివేకానంద చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఈ ఆకుపసరు ను ఒక పదార్థంగా తయారుచేసి కడుపులోకి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చని ఘంటాపథంగా చెబుతున్నారు. అంతేకాకుండా కరోనాతో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని వీరు పేర్కొంటున్నారు.

  ఇది చదవండి: ఏపీలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు..., మాట నిలబెట్టుకున్న మెగాస్టార్


  ఈ ఔషధాన్ని రెండు విధాలుగా ఏర్పాటు చేశామని మొదటిది ముందస్తుగా కరోనా రాకుండా ఉండాలని ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు.., రెండోది కరోనా పాజిటివ్ వచ్చినవారు వాడాల్సిన ఔషధం అని వివరించారు. ఐతే ఈ మందును గర్భవతులు, బాలింతలు, నెలసరి వచ్చిన వారు వాడకూడదని సూచిస్తున్నారు. తాము ఇచ్చే మందును చిన్న పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా వాడొచ్చని చెప్తున్నారు. ఈ మందు కరోనాను తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని... ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ఇతర రంగాలకు చెందిన వారికి కూడా తమ ఔషధం ఇచ్చామని వివరించారు. మరి ఆనందయ్య ఇస్తున్న మందు మాదిరి.. ఈ ఆకు పసరు వైద్యం నిజంగానే కరోనాను తరిమి కొడుతుందా అనేది వాడుతున్నవారికే తెలియాలి.

  GT Hemanth Kumar, Tirupati Correspondent, News18
  Published by:Purna Chandra
  First published: