GT Hemanth Kumar, News18, Tirupati
Singer Sravani Bhargavi: Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి (Sravana Bhargavi) చుట్టూ మరో వివాదం అలుముకుంది. ఈ వివాదానికి ఆమె తాజాగా పాడి.. నటించిన పాటే కారణం. అయితే అది కూడా భక్తి పాట. భక్తి పాట పాడితే వివాదమెందుకు? అనే డౌట్ పడుతున్నారా..? సాధారణంగా అన్నమయ్య (Annamayya) వేంకటేశ్వర స్వామిపై భక్తితో పాడిన పాటలను.. హిందువులు అంతా ఎంతగానో ఆరాధిస్తారు.. ఆ పాటలు విని పులకించిపోతారు. ఆయన రాసిన కీర్తనల్లో ఒకటి.. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’.. ఆ కీర్తనను శ్రావణి భార్గవి ఆలపించి యూట్యూబ్ ఛానెల్ (Youtube Channel) లో పోస్ట్ చేశారు. వివాదానికి ఆ పాటే కారణం అయ్యింది. ఎందుకంటే పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై నాలుగు వేల సంకీర్తనలు శ్రీ శ్రీ వెంకటేశ్వరుని సమర్పించిన తెలుగు మొట్టమొదట వాగ్గేయకారుడు. ఆయన పాటలు వింటేనే వేంకటేశ్వరుడినే నేరుగా దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. స్వామి వారి రూపాన్ని.. లీలలను కీర్తన రూపంలో రాసిన అన్నమయ్యా పాటలు సినిమాల్లో కూడా వాడుతుంటారు. కొన్ని పాటలు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఆలా ఇప్పుడు ఓ పాట అన్నమయ్య వంశస్థుల ఆగ్రహానికి గురైంది.
శ్రావణ భార్గవి తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒకపరి ఒకపరి వయ్యారమై అనే పాటను హమ్మింగ్ చేస్తూ తన మనోభావాన్ని కళ్ళలో చూపిస్తూ ఆ పాటను చిత్రీకరించింది. ఆ పాటను తన యూట్యూబ్ పేజ్ మూడు రోజుల క్రితం పోస్ట్ చేశారు. తన అందాలను చూపిస్తూ.. తనను తాను అన్వయించుకుంటూ ఆ పాట చిత్రీకరించడం..
ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఆ పాటకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే వ్యూస్ సంగతి ఎలా ఉన్నా.. పాటను ఆమే అభినయం.. తన అందాలను చూపించే ప్రయత్నంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్యా వంశస్థుల దీన్నీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. స్వామిపై భక్తితో పాడిన పాటలను వ్యగ్యంగా? అసభ్యకరంగా చిత్రీకరించారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కాళ్లను పైకి చూపించడం.. వివిధ భంగిమల్లో నిద్రించడం.. ఇలా పలు విషయాల్లో వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో లెక్కలు మారుతున్నాయా? రఘురామకు జనసేన స్నేహహస్తం.. ఇదే లెక్క
అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యలు వెంటేశ్వర స్వామికి అభిషేక కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి.. ఇలా వివిధ భంగిమల్లో కనిపిస్తూ.. కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించటం, ఆమె అందాన్ని వర్ణించటానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అంటూ అన్నమయ్య వారసులు తాళ్లపాక వెంకట రాఘవాచార్యలు తెలిపారు. అయితే ఈ విషయంపై శ్రావణ భార్గవితో మారు మాట్లాడారన్నారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం కూడా వింతగానే ఉందన్నారు. తాను బ్రాహ్మణ అమ్మాయినే అని.. తాను కూడా నోములు, వ్రతాలు, పూజాలు అన్నీ చేస్తాను అని.. ఒకవేళ యూ ట్యూబ్ ఛానెల్లో పాట గమనించి.. అందులో ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు యూ ట్యూబ్ వారికి కంప్లయింట్ చేయండి అంటూ వెటకారంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణ భార్గవి బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని.. సాధారణంగా ఎవరైనా అన్నమాచార్యుల కీర్తను తీసుకుంటే ‘తిరు వేంకటా చలపతి’ అనే ముద్రతోనే ఏ కీర్తనను అయినా ఎండ్ చేస్తారు. కానీ అలా చేయకుండా ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అన్న శృంగార కీర్తనను మేం ఎందుకు చేయకూడదు’ అని శ్రావణ భార్గవి ఎదురు ప్రశ్నించారని వెల్లడించారు. ఈ వివాదంపై తమ వంశం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అలాగే టీటీడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వారు ఏవైనా చర్యలు తీసుకుంటే సరే.. లేదంటే.. తాము ఏం చేయాలి అన్నదానిపై ఆలోచిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala tirupati devasthanam, Tirupati