పౌల్ట్రీ పాడిపరిశ్రమ చాల వరకు రిస్క్ తో పాటు అధిక పెట్టుబడితో కూడుకున్నవి. వీటిని పెట్టాలంటే కనీసం రూ. 10లక్షల నుంచి 20 లక్షలు కావాల్సిందే. తక్కువ ఖర్చుతో అధిక లాభం వచ్చే పరిశ్రమలు చాలా అరుదు. అలాంటి వాటిలో పందుల పెంపకం ఒకటి.
అవును మీరు విన్నది నిజమే. అతి తక్కువ ఖర్చుతో ఒక్కసారి పెట్టుబడి పెడితే... నిరంతరాయంగా ప్రొడక్షన్ వచ్చే ఏకైక బిజినెస్ పందుల పెంపకమే. చాలా మంది పందుల పెంపకమా చీఛీ అంటారు. కానీ ఫార్మ్స్ లో పెంచే పందులకు ఎనలేని డిమాండ్ ఉంది. మీరు అనుకున్నట్లు నాటు పందుల పెంపకం కాదిది. తెల్ల పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా చెప్తున్నారు నిపుణులు. అసలు పందులను ఎలా పెంచాలి..? అయ్యే ఖర్చు ఎంత..?? వీటికి కావాల్సిన మేత ఏంటి...?? తెలుసుకుందాం.
కోళ్ళ ఫాంలు, పాడి ఆవులు, గేదల పెంపకం మొగ్గు చూపుతున్నారు. అయితే కోళ్లు, గొర్రెలతో పోల్చితే పందుల పెంపకం మరింత లాభ సాటిగా మారుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు దోహద పడుతుంది. పందుల పెంపకంలో తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ.. రైతులకు తన వంతు చేయూత అందిస్తోంది. ఆరోగ్యకరమైన మేలు జాతి పందులను అందించడమే కాకుండా వాటి పోషణకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్లు, పరిశోధకులు.
పందులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు తగిన చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా రైతులు పొలంలోనే చిన్నపాటి షెడ్లను' వేసుకుని ఆడ,మగ పందులను.. పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఒక ఆడ పంది కేవలం 15 నెలల కాలంలో పిల్లలను పెడుతుంది. దీంతో రైతులు అధిక లాభాలు సాధించే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ పరంగా స్థానికంగానే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ , విదేశాల్లో పంది మాంసానికి మంచి డిమాండ్ ఉండటమే ఈ వ్యాపారం పెరగడానికి ప్రధాన కారణం.
మాంసం రూపంలో మనుషులు తీసుకొనే ఆహారంలో ఎన్నో పోషకాలు లభ్యం అవుతూ ఉంటాయి. సాధారణంగా కోడి, మేక మాసంలో ప్రతి వంద గ్రాములలో 170 నుంచి 180 శాతం ప్రోటీన్స్ ఉంటే.. పంది మాసంలో ప్రతి వంద గ్రాములలో 230 నుంచి 240 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయట. అందుకే ఈ మధ్య కాలంలో పంది మాంసానికి గిరాకీ బాగా పెరిగింది. ఇక పంది మాంసాన్ని పైల్స్ వ్యాధి ఉన్నవాళ్లు తింటే.. తక్కువ వ్యవధిలోనే ఆ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Tirupati