RK Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) లో కొందరి నేతలు నిత్యం టార్గెట్ అవుతుంటారు. అందుకు కారణం వారి పొలిటికల్ ఫైర్ బ్రాండ్లు కావడమే..? తమ పార్టీని ఏమైనా అన్నా..? అధినేత జగన్ (Jagan) పై విమర్శలు చేసినా ఓ రేంజ్ లో విరుచుకుపడతారు. అలాంటి వారిలో మంత్రి రోజా (Minister Roja) ఒకరు. చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో ఉన్నారు. కాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ద్‌స్త్ షోలో జడ్జిగా ఉన్న ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం బుల్లితెరకు కూడా దూరమయ్యారు. ఫుల్ టైమ్ పొలిటిషియన్‌గా బిజీగా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో రోజా ముందు ఉంటారు. అందుకే ఆమెను సైతం ప్రత్యర్థులు నిత్యం టార్గెట్ చేస్తున్నారు. రోజాపై విమర్శలు చేయడమే కాదు.. వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై ఆమెపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ఇప్పుడు తన కూతురిని కూడా ట్రోల్స్ చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీరు పెట్టుకున్నారు రోజా..
ప్రస్తుతం నటనకు విరామమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు రోజా.. ప్రస్తుతం ఏపీ రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా కొనసాగుతోన్న రోజా ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. అందులో సినిమాలు, రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటోన్న ఒడిదొడుకులను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తోన్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.
తన కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్ అన్నారు. తనది చాలా మృదు స్వభావమని. అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూసి తన కుమార్తె చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద తనను ప్రశ్నించిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన కూతురుని మాత్రమే కాదన.. తన కుటుంబ సభ్యులు ఎవరినీ వదలడం లేదన్నారు. తనలాగే తన సోదరుడి గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారన్నారు ఇదే చాలా దారుణం అన్నారు.
అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని తన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను అన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆమె వ్యాఖ్యలు అటు టాలీవుడ్, ఇటు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anshu roja selvamani, AP News, Minister Roja