Home /News /andhra-pradesh /

TIRUPATI ANDHRA PRADESH HIGH COURT SHIFTED PROPOSALS NOT RECEIVED FROM GOVERNMENT CENTRAL MINSTER GAVE CLARITY NGS

AP High Court: హైకోర్టు తరలింపు ప్రతిపాదనలు లేవా? కేంద్రం కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పిందంటే?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ఇప్పట్లో ఉండదా..? తాజాగా కేంద్రం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు తమ దగ్గరకు ప్రతిపాదనలే రాలేదు అంటోంది.. ఇంతకీ ఏం జరుగుతోంది..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    AP High Court: త్వరలోనే హైకోర్టు కర్నూలు (kurnool) కు తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నట్టు సమాచారం.. ఒకటి రెండు నెలల్లోనే ప్రక్రియ పర్తవుతుందని వైసీపీ (YCP) వర్గాలు చెబుతున్నాయి.. న్యాయ స్థానం సైతం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనేదే అని తేల్చి చెప్పడంతో ప్రక్రియ వేగవంతమైంది. అయితే తాజాగా ఏపీ హైకోర్టు (AP High Court) తరలింపుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం (AP Government), హైకోర్టు (High Court) పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. అయితే అక్కడితోనే ఆగన కేంద్రం.. అసలు హైకోర్టు తరలింపుపై తమకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు ఏవీ అందలేదని చెప్పి షాక్ ఇచ్చింది. సాధారణంగా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు.. కేంద్ర హోం శాఖకు కచ్చితంగా సమాచారం అందిస్తుంది.. లేదంటే సాంకేతిక, న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. కేంద్ర పెద్దలతో చాలా సంఖ్యంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో కేంద్రానికి ఆయన అండగా ఉంటున్నారు.. చాలా సందర్భాల్లో బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతు తెలిపారు కూడా.. అలాంటి జగన్.. కేంద్రానికి చెప్పకుండా హైకోర్టు తరలిస్తారా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

    అయితే సాధారణంగా ఈ విషయంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని ఆ తర్వాతే తమకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు లోక్ సభలో లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.



    ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే..? ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందన్నారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వమే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని ఆయన చెప్పారు.

    ఇదీచదవండి : మిస్ సౌత్ ఇండియాగా అంధ్రా అమ్మాయి.. ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఇదే

    తాజాగా కేంద్రం ఇచ్చిన సమాధానం చూస్తుంటే.. హైకోర్టు తరలింపు కూడా ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే టాక్ కూడా ఉంది. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే కనక.. ఇక హైకోర్టు తరలింపుకు పూర్తిగా బ్రేకులు పడినట్టే..? మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే ఆ ప్రతిపాదన ముందుకు వెళ్తుంది.. లేదంటే ఇప్పుడున్నచోట హైకోర్టు కొనసాగే అవకాశం ఉంటుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP High Court, AP News, Central governmennt

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు