Anandayya Medicine: ఆనందయ్య కరోనా మందుకు బ్రేక్.., మంత్రి భేటీకి కారణం అదేనా..?

ఆనందయ్య ముందుపై రేపు క్లారిటీ

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందుపై (Anandayya Ayurveda Medicine) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం బొణిగి ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందుకు అధికారులు బ్రేక్ వేశారు. ఆనందయ్య మందును పదిరోజుల పాటు నిలిపివేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇంటికి, మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు.. ఆ పరిసరాలను ఖాళీ చేయించారు. మందు తయారీకి తీసుకొచ్చిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతిచ్చేవరకు కొన్నిరోజుల పాటు పంపిణీని నిలిపేయాలని... అధ్యయనం పూర్తైన తర్వాత పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ప్రకటించారు. మరోవైపు ఆనందయ్య తయారు చేసే మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం ఈనెల 24న కృష్ణపట్నం వెళ్తోంది. అక్కడ ఆనందయ్య తయారు చేసే మందును బృందం పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా ఆనందయ్య తాను తయారు చేసే మందుపై డెమో ఇవ్వనున్నారు. శాంపిల్స్ సేకరించిన అనంతరం ఐసీఎంఆర్ బృందం వాటిపై అధ్యయనం చేయనుంది. ఆ తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

    ఇర నెల్లూరు ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ కూడా స్పందించింది. ఈ ఆయుర్వేద మందుపై ఇప్పుడేమీ మాట్లాడనని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ వర్షిణి తెలిపారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోందని.. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతే మాట్లాడతానని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి ఏమి మాట్లాడినా గందరగోళం సృష్టించినట్లవుతుందన్నారు.

    కృష్ణపట్నంలో బాలురుతీరిన జనం


    మరోవైపు ఆనందయ్యతో మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. శనివారం ఉదయం నెల్లూరు వెళ్లిన మంత్రి నాని.. ఓ హోటల్లో ఆనందయ్యతే భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆనందయ్య తయారు చేస్తున్న మందు.. అందులో వాడుతున్న పదార్థాలు, దాని వినియోగం, ఫలితాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం కొవిడ్ పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందయ్య ఇచ్చే మందుపై చర్చించిన నేపథ్యంలో మంత్రి పేర్నినాని స్వయంగా నెల్లూరు వెళ్లి ఆనందయ్యతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మందును రాష్ట్ర ప్రభుతమే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇక ఇప్పటికే రాష్ట్ర ఆయుష్ శాఖ ఆనందయ్య మందును పరిశీలించింది. శుక్రవారం కృష్ణపట్నం వెళ్లి శాంపుల్స్ సేకరించింది. మందును తయారు చేస్తున్న పదార్ధాలు, తయారు చేస్తున్న తీరు, రోగులకు పంపిణీ చేసే విధానం, కోలుకుంటున్న తీరు తదితర వివరాలను సేకరించారు. ఐతే ఆయుర్వేద పరంగా దీనిని మరింత పరీక్షించాలని అప్పటివరకు పంపిణీ నిలిపేయాలను ఆయుష్ విభాగం అధికారులు ఆనందయ్యను ఆదేశించారు. ఐతే ఇందులో వాడుతున్న పదార్ధాలు హానికరమైనని కావని స్పష్టం చేసింది. మరోవైపు ఆనందయ్య మందుపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆయనకు రక్షణ కల్పించాలని.. కార్పొరేట్ ఆస్పత్రులు, మందుల మాఫియా నుంచి ఆయన్ను రక్షించాలన్న డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
    First published: