Home /News /andhra-pradesh /

TIRUPATI ANDHRA PRADESH GOVERNMENT READY TO TAKE ACTION ON AMBULANCE MAFIA CHITTOOR COLLECTOR FIXED ALL PRICES NGS TPT

AP Government: ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కార్.. అంబులెన్స్‌ మాఫియాకు చెక్ పెడుతూ నిర్ణయం..?

అంబులెన్స్ మాఫియాకు చెక్

అంబులెన్స్ మాఫియాకు చెక్

AP Government: ఆంధ్రప్రదేశ్ అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా కథనాలు నిత్యం వింటూనే ఉన్నాం.. ముఖ్యంగా కరోనా మహమ్మారి వెంటాడినప్పటి నుంచి అంబులెన్స్ డ్రైవర్ల దందాలకు హద్దే లేకుండా పోతోంది. వారి కాసుల దాహనికి కొందరు బలైనా..వారిలో మార్పు రావడం లేదు. దీంతో మాఫియా కట్టడికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    AP Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అంబులెన్స్ డ్రైవర్ల (Ambulance Drivers) దందా మితిమీరిపోయింది. అప్పటికే కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రిని.. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరీ ఇంత కర్కసత్వమే అనేలా చేశాయి. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించేందుకు 90 కిలోమీటర్లకు వేలకు వేలు డిమాండ్ చేశారు. ఉచిత అంబులెన్స్ వచ్చినా ఆ డ్రైవర్ ను బెదిరించి, తన్ని తరిమేశారు. అంబులెన్స్ డ్రైవర్లు అడిగినంత డబ్బు కట్టలేక.. వేరే దారిలేక.. కన్నకొడుకు మృతదేహాన్ని కన్నీటిని బిగపెట్టుకుంటూ.. బైకుపై తీసుకెళ్లాల్సిన దుస్థితి కలిగింది ఆ తండ్రికి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరీ ఇంత దారుణమా.. అనే సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ ఘటనపై సామాన్య ప్రజలు, విపక్షాలు, వివిధ సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపించాయి. ఈ ఘటనపై సీఎం జగన్ సైతం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలి అంటే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం అంబులెన్స్ మాఫియా (Ambulance mafia)పై కన్నెర్ర చేసింది. కఠిన చర్యలకు సిద్ధమైంది.

    ఇకపై ఏపీ వ్యాప్తంగా అంబులెన్స్‌లకు చార్జీలను(ambulance fare) ఫిక్స్‌ చేస్తూ ప్రత్యేక ఆర్డర్స్‌ ఇచ్చింది. ఆసుపత్రుల్లో మాఫియాగా మారిన అంబులెన్స్ దందా కు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. అంబులెన్స్ దందా పై నిన్న జిల్లా కలెక్టర్‌తో సమావేశమైయ్యారు ఆర్డీఓ, డీఎంహెచ్ ఓ, ఆర్టీఓలు. ఈ సమావేశం తర్వాత తాయరు చేసిన రిపోర్ట్‌ను చిత్తూరు కలెక్టర్‌కు సమర్పించారు. చార్జీలవసూలు, నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులపై అంబులెన్స్ డ్రైవర్లు, ఆపరేటర్లతో సమావేశమై తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ కు వివరించారు అధికారులు.

    ఇదీ చదవండి : తప్పని సరై ఆస్పత్రికి వెళ్తున్నారా..? అయితే మీతో పాటు ఇది ఉండాల్సిందే..?

    ఇకపై జిల్లా వ్యాప్తంగా అంబులెన్స్ చార్జీలను అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నిర్దేశించిన రేట్ల అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం మూడు కేటగిరీల్లో అంబులెన్స్ చార్జీలను అధికారులు విభజించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలని సూచించారు.

    ఇదీ చదవండి : టోల్ ఫీజు అడిగినందుకు చుక్కలు చూపించిన డ్రైవర్.. ఏం చేశాడో చూడండి
    ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అంబులెన్సు నిర్వాహకులు వసూలు చేయాల్సిన చార్జీల వివరాలను ధరల పట్టిక లను ఆస్పత్రుల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈఎంటీ బితో ఉన్న.. బేసిక్ లైఫ్ సపోర్ట్, పెసెంట్ ట్రాన్స్ పోర్ట్ అంబులెన్స్‌లు కిలో మీటర్ కు ఎంత మేర చార్జీలు వసూలు చేయాలన్న దానిపై బోర్డులు ఏర్పాటు చేయలాని నిర్ణయించారు. ఆ రేట్లు కాకుండా ప్రైవేటు అంబులెన్స్ డైవర్లు అత్యధిక ఫీజులు వసూలు చేస్తే.. వెంటనే ఫిర్యాదులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. అది కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా చేయాలని జిల్లా కలెక్టర్.. ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు