Home /News /andhra-pradesh /

TIRUPATI ANDHRA PRADESH CRIME NEWS MAN UNEXPECTED FALL IN HOT COOKING AMBALI NGS TPT

Unexpected: భక్తుల కోసం అంబలి తాయారు చేస్తుంటే.. ఓ వ్యక్తికి మూర్చ.. ఎంత దారుణం జరిగిందంటే

Unexpected: అమ్మవారి దయ అందరి భక్తులపై ఉండాలనే ఉద్దేశంతో అంబలి తయారు చేయిస్తున్న వ్యక్తికి.. సడెన్ గా మూర్చ వచ్చింది. దీంతో ఊహించని దారుణం జరిగింది. ఆ ప్రాంతమంతా విషాధ చాయలు అలముకున్నాయి.

Unexpected: అమ్మవారి దయ అందరి భక్తులపై ఉండాలనే ఉద్దేశంతో అంబలి తయారు చేయిస్తున్న వ్యక్తికి.. సడెన్ గా మూర్చ వచ్చింది. దీంతో ఊహించని దారుణం జరిగింది. ఆ ప్రాంతమంతా విషాధ చాయలు అలముకున్నాయి.

Unexpected: అమ్మవారి దయ అందరి భక్తులపై ఉండాలనే ఉద్దేశంతో అంబలి తయారు చేయిస్తున్న వ్యక్తికి.. సడెన్ గా మూర్చ వచ్చింది. దీంతో ఊహించని దారుణం జరిగింది. ఆ ప్రాంతమంతా విషాధ చాయలు అలముకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    GT Hemanth Kumar, Tirupathi, News18

    Unexpected: హిందూ సంప్రదాయం (Hindu Culture) లో పండుగలు.. జాతరలు అంటేనే బంధు మిత్రులతో కలసి నిర్వహించుకుంటారు.  వేకువజాము లేచి.. ఇంటిని శుభ్రపరచి.. ఆలయాలకు వెళ్లి ప్రత్యే అభిషేకాలు.. నివేదనలు చేస్తుంటారు. చిన్న పెద్ద.. ఇరుగు పొరుగు అనే తేడా లేకుండా అందరూ కలసి వేడుకలను జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మవారి జాతర అంటే ఉదయం నుంచే పొంగళ్ళు.. అంబలి పంచె కార్యక్రమం చేస్తుంటారు. బంధు, మిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా పొంగళ్ళు సమర్పించి‌ తమ కష్టాలు తొలగి పోవాలని అమ్మవారిని ప్రార్ధిస్తారు. ఇక శ్రావణ శుక్రవారాల్లో (Sravana Sukravaram) అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. వేకువ జాము అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి బంధు మిత్రులతో  పొంగళ్ళు తయారు చేసి భక్తులకు పంపణి చేస్తుంటారు కొందరు. అలా తోటి భక్తులకు పొంగళి పంచాలనుకునే వ్యక్తి ఇంట విషాదం నెలకొంది.

    అమ్మవారి భక్తుల కోసం ఓ భక్తుడు  దాదాపు ఆరు గుండాల్లో గంజి తయారు చేయిస్తున్నాడు. అందరికీ నచ్చేలా టేస్టు ఉండాలనే తాపత్రతయంలో..  తయారీ దగ్గరే పర్యవేక్షిస్తూ ఉండగా.. అతడికి మూర్ఛ వచ్చింది.  మూర్చ వచ్చి గంజిలో‌ పడిపోయాడు ఆ  భక్తుడు.. అప్పటికే అది వేడి వేడిగా ఉడుకుతుండడంతో అతడిని వెంటనే తీయడం కష్టమైంది..



    స్థానికులు.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడు (Tamilanadu) మధురై (Madurai) పట్టణంలో అట్టహాసంగా ముత్తు మారియమ్మ తిరునాళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు.  శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని గత నెల 29వ తారీఖున స్ధానిక భక్తులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.  స్ధానిక భక్తుడు ముత్తు కుమార్ గంజిని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తులకు పంపిణీ చేయాలని భావించాడు. దాదాపు ఆరు గుండాల్లో గంజిని తయారు చేయిస్తున్నాడు.

    ఇదీచదవండి : విషవాయువు లీకేజీ ఘటనలపై సీఎం జగన్ సీరియస్.. సంచలన ఆదేశాలు

    వేకువజాము నుండి ముత్తు కుమార్ ఆలయంలో జరిగే ఏర్పాట్లను పరిశీలిస్తూ గంజి తయారు చేసే ప్రాంతంకు చేరుకున్నాడు.‌ అన్ని గుండాలను పరిశీలిస్తూ వస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ముత్తుకుమార్ కు మూర్చ రావడంతో వేడి వేడిగా గంజి గుండాలో ప్రమాదవశాత్తు పడ్డాడు.‌ గుండాలో పడిన ముత్తుకు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్ధానికులు బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు.. కానీ ముత్తుకుమార్ ను బయటకు తీయలేక గుండాను క్రిందకు పడ వేయడంతో ముత్తుకుమార్ క్రింద పడి గుండా నుండి బయటకు వచ్చాడు.

    ఇదీచదవండి : సముద్ర తీరంలో వింత జీవి.. అది ఎంత డేంజరో తెలుసా?

    అప్పటికే ముత్తుకుమార్ కు తీవ్ర గాయాలు కావడంతో స్ధానికంగా ఉన్న మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్తుకుమార్ సాయంత్రం మృతి చేందాడు. దీంతో మధురైలో విషాద ఛాయలు అలముకున్నాయి. ముత్తుకుమార్ గంజి గుండాలో పడిన సంఘటన అక్కడే ఉన్న ఆలయ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు