హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extra Marital Affair: పొలం పని చేసుకుని ఇంటికి వచ్చిన అన్నకు షాక్.. తమ్ముడితో భార్యను అలా చూసి.. ఏం చేశాడో తెలుసా?

Extra Marital Affair: పొలం పని చేసుకుని ఇంటికి వచ్చిన అన్నకు షాక్.. తమ్ముడితో భార్యను అలా చూసి.. ఏం చేశాడో తెలుసా?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extra Marital Affair: ఓ వ్యక్తి తన భార్య చనిపోవడంతో ఒంటరి అయ్యాడు.. అప్పటి నుంచి అన్నయ్య ఇంటిలోనే ఉంటున్నాడు. అయితే అన్నా రోజు పొలానికి వెళ్తుండడం.. ఇంట్లో వదిని సింగిల్ గా ఉండడంతో.. ఆమెపై మనసు పడ్డాడు.. మాట మటకలిపి ఆమెను బుట్టలో పడేశాడు.. చివరికి ఏమైంది అంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India

  Extra Marital Affair: తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు (Extra Marital Affair) కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. క్షణికావేశంలో చేస తప్పులు ప్రణాలను తీసేస్తన్నాయి. పరాయి మోజులో పడ్డ కొందరు.. ఆత్మహత్యలు (Suicide) చేసుకుంటే.. కొందరు హత్య (Murder) లకు కూడా వెనుకాడడం లేదు.. అయితే మరికొందరు భార్య లేదా భర్తలు తమను మోసం చేశారని.. క్షణికావేశంలో వారిని లేదా.. అందుకు కారణమైన వారిని హత్య చేసిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. కోరికలను అదుపులో పెట్టుకోలేకపోవడం.. లేద క్షణికావేశంలో చేసే చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతి (Tirupati) లో జరిగింది. సొంత అన్నయ్య భార్య (Brothers Wife) తో తమ్ముడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం.. ఓసారి అనుకోకుండా అన్నయ్య కంట్లో పడింది.. ఆ సమయంలో వారిద్దరూ ఏకతంగా అలా ఉండడాన్ని చూసి ఆ అన్నయ్య తట్టుకోలేకపోయాడు.. ఏం చేశాడంటే..?

  స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, 25 ఏళ్ల ప్రతాప్‌ అన్నదమ్ములు.. ఇద్దరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే 10 నెలల క్రితం ప్రతాప్‌ భార్య కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో బాలాజీ తన తమ్ముడు ప్రతాప్‌కు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. తోడబుట్టిన తమ్ముడు అని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోవడమే.. ఆ అన్నయ్య తప్పిదమైంది.

  ఇంట్లో తమ్ముడు ఖాళీగా ఉండేవాడు.. అన్నయ్య పొలం పనులకు వెళ్లాడు.. భార్య లేని ఒంటరితనంలో ఉన్న అతడి మనసు వదినపై పడింది. దీంతో అప్పటి నుంచి తన వదినతో చనువుగా ఉంటూ.. మెళ్లిగా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కూడా తన కోరికలను అదుపులో ఉంచుకోలేక.. మరిది అంటే కన్న కొడుకుతూ సమానం అనే విషయాన్ని మరిచిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య ఆ చనువు అక్రమ సంభందంగా మారింది.

  ఇదీ చదవండి : జనసేనలోకి వైసీపీ కీలక నేత.. ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్

  అయితే కొన్ని రోజులు వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది. కానీ ఓ రోజు పొలం పనులకు వెళ్లిన అన్నయ్య ఏదో అత్యవసరం ఉండడంతో త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రాత్రి ప్రతాప్, తన భార్య ఒకే దగ్గర.. చూడకూడని స్థితిలో ఉండడం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడయ్యాడు. ప్రతాప్‌పై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

  ఇదీ చదవండి : నేడే అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0 కు శ్రీకారం.. వేయి కిలోమీటర్ల రూట్ మ్యాప్ ఇదే.. అడుగడుగునా ఆంక్షలు

  స్థానికుల సమాచారం మేరకు గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు