GT Hemanth Kumar, Tirupathi, News18..
Crime News: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు తయారైంది.. రాజకీయ నాయకులు పరిస్థితి.. ఇంతకీ ఏమైంది అంటే..? తొమ్మిది నెలల క్రితం ఓ యువతీ మరొక యువకునితో ప్రేమ వివాహం చేసుకొని ఇంటి నుంచి మిస్ అయ్యింది. కుటుంబ సభ్యులు ఆ యువతీ కోసం తీవ్ర గాలింపులు చేపట్టి.. ఇక ఆచూకీ తెలియకపోవడంతో వదిలేసారు. అయితే సరిగ్గా 10 రోజుల కిందట గుర్తు తెలియని ఓ యువతి మృతదేహం లభ్యమైంది. దింతో పోలీసులు మిస్సింగ్ (Missing) అయిన యువతీ మృతదేహమా అంటూ అరా తీశారు. అవును ఆ మృతదేహం తమ కూతురిదే అని తల్లిదండ్రులు చెప్పడంతో.. ఆమె ఆత్మహత్య (Suicide) లేదా హత్య (Murder) కు కారణమైన సంబంధిత యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ( Police Station ) లో ఆందోళనలు మొదలయ్యాయి. టీడీపీ , జనసేన పార్టీ నేతలు ధర్నాకు దిగారు. కానీ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. అసలేమైంది అంటే..?
వివరాల్లోకి వెళితే.. శ్రీ కాళహస్తి (Srikalahasthi) పట్టణంలోని మంచినీళ్ళ గుంటకు చెందిన చంద్రితా అనే యువతి తొమ్మిది నెలల నుండి కనపడడం లేదు. దీంతో ఆమె కనిపించడం లేదని.. నెల్లూరు జిల్లా (Nellore District) లోని దొరవారి సత్రంలో ఫిర్యాదు చేసారు కుటుంబీకులు. అయితే ఈనెల 20వ తేదీన గుర్తు తెలియని యువతీ మృతదేహం కేవీబి పురం పరిధిలో లభ్యం అయ్యింది.
దింతో పోలీసులు పెండింగ్లో ఉన్న చంద్రితా అనే అనుమానంతో కుటుంబీకులను పిలిచారు. అది తమ బిడ్డ చంద్రితాదే అని.. రామాపురానికి చెందిన వాలంటరీ చంద్రశేఖర్ చంపేశాడని ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ చంద్రిత కుటుంబ సభ్యులు.. టీడీపీ నాయకులు, జనసేన నాయకుల ధర్నాలు, నిరసనలతో శ్రీకాళహస్తి పట్టణం వారం రోజులుగా దద్ధరిల్లి పోయింది.
ఇదీ చదవండి : మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే రాజధాని.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
నాయకుల మధ్య మాటలు యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇంతలో ఊహించని సంఘటనతో టీడీపీ, జనసేన నేతలకు ట్విస్టు ఇచ్చారు ప్రేమికులు. తాము క్షేమంగా ఉన్నామని తమపై వేసిన నిందలకు సమాధానం ఎవరు చెబుతారని చంద్రశేఖర్ ప్రశ్నించాడు. తన భార్యని చంపేశాను తాను హంతకుడని అన్న టీడీపీ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.
ఇదీ చదవండి : కార్తీక మాసంలో తప్పక చూడాల్సిన ప్రాంతం.. ఎందుకంత ప్రత్యేకతో తెలుసా..
తాము క్షేమంగా ఉన్నామని వారి తల్లి, తండ్రులకు తెలియజేసారు. తమపై వేస్తున్న నిందలు ఉపసంహరించుకొని, తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. దింతో ఒక్కసారిగా టీడీపీ, జనసేన నేతలు కంగుతిన్నారు. ధర్నాలు నిరసనలు చేసి భంగపాటుకు గురైనట్లు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ధర్నాలు.. నిరసనలు చేయాలంటే మరోసారి ఆలోచించేలా చేసారని అతర్గతంగా మాట్లాడుకోవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news, Lovers