హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: పాపకు తన పోలికలు రాలేదని తండ్రి కిరాతకం.. అసలు మ్యాటర్ అదేనా..?

Crime News: పాపకు తన పోలికలు రాలేదని తండ్రి కిరాతకం.. అసలు మ్యాటర్ అదేనా..?

కూతురికి తన పోలీకలు రాలేదని తండ్రి కిరాతకం

కూతురికి తన పోలీకలు రాలేదని తండ్రి కిరాతకం

Crime News: పాపం పూర్తిగా ఏడాది కూడా నిండ లేదు.. కానీ అప్పుడు నూరేళ్లు నిండిపోయేలా చేశాడు కసాయి తండ్రి.. కూతురుకి తన పోలీకలు రాలేదనే అనుమానంతో.. కిరాతకానికి పాల్పడ్డాడు.. అసలు మ్యాటర్ అదేనా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

GT Hemanth Kumar, Tirupathi, News18.

Crime News: మానవత్వం రోజు రోజుకూ మంటగలిసి పోతోంది. ఆఖరికి పిల్లలకు తండ్రి దగ్గర కూడా రక్షణ లేకుండా పోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన.. తండ్రి కాలయముడి (Killer Father) అయితే ఆ బిడ్డ ఆవేదన ఎవరికి చెప్పుకుంటుంది.. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. జీవితాంతం కష్టాలు ఎదురైనా.. కాపాడాల్సిన తండ్రే తన పాలిట యముడు అయితే.. ఆ బంధానికి అర్థం ఏముంటుంది. మరి కొందరు అయితే.. నరరూప రాక్షసులుగా మారుతున్నారు. కోరికలను అదుపులో చేసుకోలేక కొందరు.. భార్యపై అనుమానంతో మరికొందరు.. మత్తుకు బానిసై మరి కొందరు.. కన్న పేగులనే నరుక్కుంటున్నారు . ముఖ్యంగా  మూడు ముళ్ల బంధానికి బ్రేకప్ చెప్పి.. అక్రమ సంబంధానికే (Extramarital Affair) అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లాలిని కాదని..  ప్రేయురాలి మోజులో పడుతున్నారు. అందులో భాగంగా కిరాతకులుగా మారుతున్నారు.

చిత్తూరు జిల్లా (Chittoor District) లో జరిగిన ఓ ఘటన ఇలాంటి దారుణాలకు ఒక ఉదహరణ.. తన భార్యకు తెలియకుండా రెండో  వివాహం చేసుకున్నాడు.  ఆ తరువాత ఆమెకు విషయం తెలిసినా..? భర్త కావాలనే కోరుకుంది.  ఆ కసాయి భర్త రెండో భార్య మోజులో పడి మొదటి భార్యను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడితో అతడి మనసు చల్లారలేదు.. మాయమాటలు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి భార్య, బిడ్డను తీసుకెళ్లాడు. ఎవరు లేని సమయంలో భార్య.. బిడ్డపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన.. చిత్తూరు జిల్లా గురువరాజు పల్లె ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది.

ఇదీ చదవండి : వైసీపీకి బిగ్ షాక్.. వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశం

కుమార్ అనే వ్యక్తి అక్కడ నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల పావనిని రెండేళ్ల క్రితం ప్రేమించి  పెళ్లాడాడు. అయితే  తొమ్మిది నెలల క్రితం జన్మించిన అమ్మాయికి..  అమృత అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకునే వారు.  కానీ కొన్ని రోజుల తరువాత..  కుమార్ భార్య పిల్లలతో సరిగా ఉండటం లేదు.

ఇదీ చదవండి: వైసీపీని తాకిన ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎంపీ నివాసంలో తనిఖీలు

ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొన్నాళ్ళకు నగరిలో వేరొక యువతితో..  వివాహేతర సంభంధం పెట్టుకొని... అనంతరం భార్యకు తెలియకుండా వివాహం చేసుకున్నట్లు తేలింది. అయినా భర్త తనకు కావాలంటూ మొదటి భార్య పావని ఎంతగానో కోరుకునేది. దీంతో అతడు..  మొదటి భార్యపై ద్వేషం పెంచుకున్నాడు.

ఇదీ చదవండి: మీకు ఈ మెసేజ్ లు వస్తున్నాయా..? విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మొదటి భార్య అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న విధంగా పక్క వ్యూహాన్నీ రచించుకున్నాడు. భార్యతో గొడవ పెట్టుకోవడం కోసం.. తనకు  పుట్టిన బిడ్డకు తన పోలికలు లేవంటూ..  తరచు గొడవకు దిగేవాడు. అయినా.. పావని కుమార్ తో సర్దుకుపోయే ప్రయత్నం చేసింది.

ఇదీ చదవండి : త్రీ ఇడియట్స్‌ సినిమాను గుర్తు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు..! మీరే చూడండి

దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్పాన కుమార్వ.. ఆమెతో  సౌమ్యంగా మాట్లాడి బయటకు తీసుకెళ్లాడు. మాయ మాటలు చెప్పి బిడ్డను కూడా విన్సారి పరిశ్రమ వెనుక ఉన్న ఇసుక వాగు దగ్గరికి తీసుకెళ్లాడు. మొదటగా బిడ్డను వాగులో విసిరివేసాడు. అనంతరం పావణిని కొట్టి చంపి వాగులో పడేసాడు. మూడు రోజుల నుంచి కుమార్తె, మనవరాలు కన్పించకపోవడంతో పావని తల్లిదండ్రులు.. కుమార్ ని ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఆదాయినికి వచ్చి నష్టం ఏమీ లేదు.. ప్రస్తుతం ఉన్న అప్పులు ఇవే.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

పావని కుటుంబ సభ్యులు. మొదట తనకు సంబంధం లేదని వాదించాడు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో భార్యాబిడ్డలను చంపిన స్థలానికి పోలీసులను కుమార్ తీసుకెళ్లాడు. ఎయిర్ పోర్టు సమీపంలోని కాలువలో తేలియాడుతున్న పావని, చిన్న బిడ్డ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Husband kill wife