హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి.. 6 ఏళ్ళకే మరొకరితో ఎఫైర్.. ఆ భర్త ఏం చేశాడంటే?

Extramarital Affair: పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి.. 6 ఏళ్ళకే మరొకరితో ఎఫైర్.. ఆ భర్త ఏం చేశాడంటే?

వివాహేతర సంబంధానికి భార్య బలి

వివాహేతర సంబంధానికి భార్య బలి

Extramarital Affair: వారిద్దరూ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. మూడేళ్ల తరువాత భార్యపై భర్తకు మోజు తగ్గినట్టు ఉంది.. చివరికి ఆరేళ్ల తరువాత దూరం అయ్యారు.. కానీ ఆ భర్త అక్రమ సంబంధం కోసం ఏం చేశాడంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India

  GT Hemanth Kumar, Tirupathi, News18.

  Extramarital Affair: ఆధునికత పెరిగే కొద్దీ.. మనిషి జీవన శైలిలో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కొన్నేళ్ల కిందట వివాహం అంటే విడతీయరాని బంధంగా ఉండేది. ఎన్ని గొడవలు ఉన్నా.. పెద్దల జోక్యమో.. వివాహ బంధానికి వారు ఇచ్చే విలువో.. కారణం ఏదైనా ఎవరో ఒకరు సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెళ్లైన వారు మాత్రం.. పరాయి మోజులో పక్కదారి పడుతున్నారు. భర్తలే కాదు.. భార్యలు (Wife) కూడా కొందరు అదే దారిలో వెళ్తున్నారు.  భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే పొరుగింటి మోజు పడ్డ వ్యక్తితో రాసలీల నడపడం వంటి కారణంగా హత్యలు (Murder Case) పెరుగుతున్నాయి. కేవలం పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు..  ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకున్న వారు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

  కామవాంఛతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వివాహితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ ఘనట వివాహ వ్యవస్థపై నమ్మకం  పోయేలా చేసింది. ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి మరీ  ప్రేమే గొప్పది అంటూ మూడు ముళ్లు బంధంతో ఒక్కటైయ్యారు. ఆరేళ్ళ పాటు సజావుగా సాగిన కాపురంలో అనుమానం పెను భూతంగా మారింది. ఇద్దరు విడిగా ఉన్న.. అనుమానం భర్తలో పోలేదు. చివరికీ ఆ భర్త చేసిన పనేంటో తెలుసా..?

   

  ఉమ్మడి చిత్తూరు జిల్లా భాకరాపేటలో నివాసం ఉంటున్న శ్రీకాంత్ అదే ప్రాంతానికి చిందిన రెడ్డమ్మతో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు అవ్వడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. ఒప్పించినా... మెపించిన పెద్దలు మాత్రం వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తూ వచ్చేవారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 7 సంవత్సరాల కుమారుడి సైతం ఉన్నాడు.

  ఇదీ చదవండి : సంగం బ్యారేజ్ జాతికి అంకితం.. ప్రత్యేకతలు ఇవే.. సీఎం జగన్ వరాల జల్లు

  ఎంతో ఆనందంగా సాగిన వీరి కాపురంలో కలహాలు., అనుమానాలు అనే గ్యాప్ ఇద్దరి మధ్య చొరబడింది. రెడ్డెమ్మ వేరొక యువకునితో వివాహేతర సంభంధం కొనసాగిస్తోందని..  తరచూ భార్యాభర్తల మధ్య గొడవ సాగేది. కొన్నాళ్లకు భర్త భార్యతో విడిగా ఉండి జీవనం సాగిస్తూ వచ్చేవాడు. ఇక జీవనోపాధి నిమిత్తం రెడ్డెమ్మ తిరుమలలో వివిధ షాపులో కూలీగా పనిచేస్తూ వచ్చేది.

  ఇదీ చదవండి: రెచ్చిపోయిన మానవ మృగం.. 9వ తరగతి బాలిక నోట్లో యాసిడ్‌ పోసి, గొంతుకోసి.. ఆపై దారుణం

  తాజాగా వినాయక చవితికి తన స్వగ్రామానికి చేరుకొని పండుగ జరుపుకుంది. ఇలా ఉంటె... ప్రియుడు తన సొంత ఊరికి సైతం వచ్చి వెళ్తున్నాడన్న సమాచారం భర్త చెవిన పడింది. దింతో భర్త శ్రీకాంత్ మరింత కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రెడ్డెమ్మ దగ్గరకు వెళ్లి... గొడవకు దిగాడు. అసలే కోపంతో ఉన్న శ్రీకాంత్ కత్తితో రెడ్డెమ్మ గొంతు కోసి హతమార్చాడు. భార్య  చనిపోయిందన్న నిర్ధారణకు వచ్చి... ఇంటి నుంచి పరారయ్యాడు శ్రీకాంత్.

  ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో కలకలం.. ఊపిరాడక 30 మంది విద్యార్థులకు అస్వస్థత

  రెడ్డెమ్మ ఇంట్లోకి వీధి కుక్కలు వెళ్లి రావడం స్థానికులు గుర్తించి... ఆమె ఇంటిలోకి వెళ్లి చూసారు. రక్తపు  మడుగులో విగత జీవిగా పడి ఉన్న రెడ్డమ్మను చుసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chittoor, Crime news, Extra marital affair

  ఉత్తమ కథలు