హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: ఈ కథలో ట్విస్టులు సినిమాల్లో కూడా ఉండవేమో? ఈ ఫ్యామిలీ డ్రామా తెలిస్తే షాక్ అవుతారు..

Crime News: ఈ కథలో ట్విస్టులు సినిమాల్లో కూడా ఉండవేమో? ఈ ఫ్యామిలీ డ్రామా తెలిస్తే షాక్ అవుతారు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime News: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ..? భార్య ఫిర్యాదు చేసింది.. రెడ్ హ్యాండెడ్ గా పోలీలకు పట్టించింది. కానీ అక్కడకు వెళ్లిన పోలీసులకు మరో షాక్ తగిలింది. ఈ ట్విస్టులు ఏంటిరా బాబోయ్ అనుకోవాల్సి వచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Chittoor, India

  GT Hemanth Kumar, Tirupathi, News18

  Crime News: భార్య భర్తల (Wife and Husband) అనుబంధం చాలా గొప్పది..  ఎంత కష్టంలో అయినా నేను ఉన్నాను అంటూ తోడు ఉండేది తాళి కట్టిన బంధమే.. జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చిన ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే.. సమస్యలను జంటగా ఎదుర్కొంటారు. ఒకరికి ఒకరై తోడుగా ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పరాయి మోజు (Extramarital Affair) లో.. క్షణకాలం సుఖం కోసం అడ్డదారులు తొక్కే వారి సంఖ్య పెరుగుతోంది. శ్రీరామ చంద్రుడి లాండి వాటు తన భర్త అని నమ్మితే.. ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు కావాలని కొరుకుంటున్నారు కొందరు.  అలాంటి ఘటనే తాజాగా ఒకటి చిత్తూరు జిల్లా (Chittoor District) లో వెలుగులోకి వచ్చింది. అయితే అ పరాయి మోజు కథలో చాలానే ట్విస్టులు బయటకు వచ్చాయి.

  పెపెళ్ళైన ఎనిమిదేళ్ల తరువాత.. ఆ భర్త.. మరొక మహిళతో వివాహేతర  సంభందం పెట్టుకున్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో  అడ్డుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? అతడి  వివాహేతర సంబంధానికి.. ఆమె అత్తమామలే వత్తాసు పలికారు. చివరికి ఏమైంది అంటే?

  అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని  నివాసం ఉంటున్నారు శంకరప్ప నాయుడు., భార్య సుశీలమ్మ. వీరికి బాల ప్రసాద్ అనే కుమారుడు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ బెథా మంగళంలోని శ్యామరహళ్లికి చెందిన ఎం. సుధతో  2014 అంటే ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.  వివాహాన్ని రంగరంగ వైభంగా నిర్వహించారు రెండు కుటుంబాల పెద్దలు..

  ఇదీ చదవండి : వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  పెళ్ళైన నాటి నుంచి భార్య భర్తలు ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు. చూసిన వారంతా వీరిది అన్యోన్య దాంపత్యం అనేవారు. అయితే  ఈ మధ్య  భార్యపై మోజు తగ్గిందో ఏమో గాని పక్క చూపులు చూడటం మొదలెట్టాడు. అదే గ్రాణంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలిపై మోజుతో కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ వచ్చేవాడు. భార్యను ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

  ఇదీ చదవండి : దేవస్థానంలో దారుణం.. మానవత్వం మరచి ఇంత దారుణమా..? ఏం జరిగింది అంటే?

  అతడి వివాహేత సంబంధం తెలిసినప్పటి నుంచి ఆమె రివర్స్ లో నిలదీయడం ప్రారంభించారు. అప్పటి నుంచి భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధించి చిత్రహింసలు గురి చేసేవాడే. కట్నం తెస్తేనే ఇంటికి రావాలంటూ భార్యను పుట్టింటికి తరిమేశాడు.  ఇలా భార్యను పుట్టింటికి పంపించి..  మరో వివాహిత స్నేహను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమెతో సహజీవనం సాగించాడు.

  ఇదీ చదవండి : ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

  విషయం తెలుసుకున్న సుధ రూరల్ పోలీసులను వెంట పెట్టుకొని భర్త ఇంటికి వెళ్ళింది. భర్తతో పాటు సహజీవనం చేస్తున్న స్నేహను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న భర్త.. అతడి ప్రియురాలు.. స్నేహ అత్తమామలు ఒక్కసారిగా రేచ్చిపోయారు. సుధ పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాడికి గురైన సుధా మదనపల్లె రురల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె  ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

  ఇదీ చదవండి : ఠాగూర్ మూవీని మించిన తెలివితేటలు.. గర్భవతి అంటూ 9 నెలలు ట్రీట్‌మెంట్.. చివరికి కడుపులోనే బిడ్డం మాయం.. ఏం చేశారంటే?

  ఆమెతో పాటు భర్త ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది. సుధ భర్త స్నేహాను గత నాలుగేళ్ళ క్రితమే వివాహం చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగేే సుధ.. పెళ్లైన కొన్నేళ్లకే భర్తను విడిచి పెట్టి.. పుట్టింటికి వెళ్లిపోయిందని.. కోర్టు ఆదేశాలతో ప్రతి నెల భర్త నుండి భరణం తీసుకుంటోందని.. వారు ఆరోపిస్తున్నారు.  ఆ తారువాతే అతడు మరో వివాహం చేసుకున్నాడని.. వారిని వివాహేతర సంబంధం కాదంటున్నారు స్నేహ అత్తామామలు.. మరి ఈ డ్రామాలో ఎవరిది నిజం అన్నది పోలీసులే నిర్ధారించాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news, Extramarital affairs

  ఉత్తమ కథలు