హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ambulance Mafia: పుట్టెడు దు:ఖంలో ఉన్నవారిని కాటేస్తున్న అంబులెన్స్ ముఠా.. అడిగినంత ఇవ్వకుంటే అంతే.. బయట వాహనం మాట్లాడితే రచ్చ రచ్చ

Ambulance Mafia: పుట్టెడు దు:ఖంలో ఉన్నవారిని కాటేస్తున్న అంబులెన్స్ ముఠా.. అడిగినంత ఇవ్వకుంటే అంతే.. బయట వాహనం మాట్లాడితే రచ్చ రచ్చ

ఆగని అంబులెన్స్ ఆగడాలు

ఆగని అంబులెన్స్ ఆగడాలు

Ambulance Mafia: ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్స్ మాఫియా రోజు రోజుకూ రెచ్చిపోతోంది. ఆపదలో అండగా ఉండాల్సిన అంబులెన్స్ ఇప్పుడు.. బాధితులను కన్నీర పెట్టుకునేలా చేస్తోంది. కాసుల కక్కుర్తి కోసం అంబులెన్స్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

GT Hemanth Kumar, Tirupathi, News18

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  అంబులెన్స్ (Ambulance) మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా అంబులెన్స్ ముఠా వేధింపు ఘటనలు  చాలానే జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి (Tirupati) రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ సిండికేట్ ఆగడాలు బాధితులను కన్నీరు పెట్టించేలా చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నా సమయంలో అంబులెన్స్ సిండికేట్ మరోసారి కర్కశత్వం ప్రదర్శించింది. బాధలో ఉన్న బంధువులు., కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసింది. తమ వాళ్ళు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే..  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అంబులెన్స్ సిబ్బందితో తిప్పలు తప్పడం లేదు.

అసలు ఏం జరిగింది అంతే.. రెండు రోజుల‌ క్రితం ఆనారోగ్యం పాలైన రేణిగుంటకు చేందిన వ్యక్తి రుయాలో అడ్మిట్ అయ్యాడు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆసుపత్రిలో‌ చికిత్స పొందతూ మృతి చెందాడు. అయితే బంధువులకు చనిపోయాడన్న విషయం తెలియక ముందే.. అంబులెన్స్ మాఫియా బేర సారాలు ఆడేందుకు సిద్ధమైంది.

మృతదేహాన్ని రేణిగుంటకు తరలించేందుకు రుయా ఆసుపత్రి దగ్గర ఉన్న ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌లు మూడు వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని మృతుడి కుటుంబ సభ్యులు బయట వాహన్ని ఆశ్రయించారు. అయితే మృతిదేహాన్ని కేవలం 800 రూపాయలకే తరలించేందుకు సిద్దం కావడంతో బయట వాహనాన్ని అడ్డుకుంది రుయా  ఆసుపత్రి ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది.

ఇదీ చదవండి : గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఏ-1 అరెస్ట్.. మరి నెక్ట్స్ ఎవరు?

వాహన డ్రైవర్ పై దాడికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అనారోగ్యంతో ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లాలన్న.... చనిపోయిన మృతదేహాలను వారి ఇంటికి తరలించాలన్న అక్కడి అంబులెన్స్ ముఠాదే పైచేయి. మృతి చెందిన సెకండ్ల వ్యవధిలో మృతుల బంధువులను చుట్టుముడతారు. వారు అడిగింది ఇవ్వకపోతే అంతే సంగతులు గొడవకు దిగేస్తారు. ఇది రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ ముఠా దౌర్జన్య ఖండ.

ఇదీ చదవండి : లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకే కుట్రలు.. ప్రమాదాన్ని పార్టీకి అంటగట్టడంపై టీడీపీ ఫైర్

మూడు వేల రూపాయలు చెల్లించుకునేందుకు తమకు స్ధోమత లేదని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లను ప్రాదేయపడినా ఏమాత్రం కనికరించలేదు.  ఆ సొమ్ము చెల్లిస్తేనే.. మృతదేహాన్ని తరలించేందుకు వీలు అవుతుందని, తమను కాదని ఎవరూ అంబులెన్స్ తీయనివ్వమని వారించారు.. ఎంతకీ అంబులెన్స్ డ్రైవర్లు ఒప్పుకోక పోవడంతో 3 వేలు ఇచ్చేందుకు నిరాకరించిన మృతుడి బంధువులు, తమకు తెలిసిన వారితో మాట్లాడని.. మరోక అంబులెన్ ను ఆశ్రయించడంతో వారు మృతిదేహాన్ని తరలించేందుకు వెయ్యి రూపాయలకు ఒప్పుకున్నారు.

ఇదీ చదవండి : చంద్రబాబు కాదు శవాల నాయుడు.. పవన్ పైనా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఐస్ మహల్ దగ్గర ఉన్న ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ శ్రీనివాసులు అంబులెన్స్ రుయా ఆసుపత్రి దగ్గరకు తీసుకువచ్చారు.. బయట వాహనాన్ని గుర్తించిన రుయా ఆసుపత్రి డ్రైవర్లు మృతదేహాన్ని తరలించేందుకు తీసుకుకొచ్చిన డ్రైవర్ శ్రీనివాసులపై వాగ్వాదానికి దిగారు.. మృతుడి బంధువులు పిలిస్తేనే తాను రుయా ఆసుపత్రి వద్దకు వచ్చానని చెప్పినా, పట్టించుకోకుండా రుయా ఆసుపత్రి వద్ద ఉన్న దాదాపు పది‌ మంది అంబులెన్స్ డ్రైవర్లు ఒక్కసారిగా శ్రీనివాసుపై దాడికి దిగ్గి అసభ్యకర పదజాలంతో దూషించారు.

ఇదీ చదవండి: ఏపీలో 175 సీట్లలో పోటీ చేస్తాం.. పోలవరం.. ప్రత్యేక హోదా మాతోనే సాధ్యం అంటున్న తెలంగాణ మంత్రి

అదే సమయంలో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన మృతుడి‌ బంధువులు రుయా ఆసుపత్రిలోని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లతో గొడవకు దిగారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రుయా ఆసుపత్రిలోని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు సద్దుమణిగారు.  ఆ వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గతంలోనే రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగు చూడటం పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కేసులు నమోదు చేయడం జరిగాయి.

First published:

Tags: Ambulence, Andhra Pradesh, AP News, Chittoor, Crime news

ఉత్తమ కథలు