Badvel By-Poll: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి... సీనియర్ మంత్రికి బాధ్యతలు..!

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల షెడ్యూల్ విడుదలైన కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై (Badvel By-Election) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) దృష్టి పెట్టారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల షెడ్యూల్ విడుదలైన కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నికపై (Badvel By-Election) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) దృష్టి పెట్టారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో జగన్ సమీక్ష నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేశారు. అలాగే వైసీపీ తరపున ఇన్ ఛార్జ్ గా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రొత్సహించి.. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో రెండు రోజుల్లో పార్టీ తరపున ప్రచారం ప్రారంభించాలన్న సీఎం.. గ్రామస్థాయి నేతలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

    ఓటింగ్ శాతం పెరగాలి
    బద్వేల్‌ ఉపఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. డాక్టర్ సుధ నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆమెకు మద్దతు తెలపాలన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో 44వేలకు పైగా మెజారిటీ వచ్చింది సీఎం జగన్ నేతలకు గుర్తుచేశారు. ఎక్కడా అతివిశ్వాసానికి తావు ఇవ్వకూడదని.., ప్రతి ఒక్కరితో మాట్లాడి పార్టీకి ఓటు వేసేలా చూడాలన్నారు. 2019 నమోదైన 77శాతం ఓటింగ్ శాతానికంటే అధికంగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని ఒక నేతకు అప్పగించి ప్రచారం నిర్వహించాలన్నారు.

    ఇది చదవండి: పవన్ శ్రమదానానికి నో పర్మిషన్..జనసేన-వైసీపీ మధ్య ముదురుతున్న వార్..


    ప్రతిపక్షాలు సిద్ధం
    ఇదిలా ఉంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బద్వేలు ఉపఎన్నికకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన టీడీపీ ఓబుళాపురం రాజశేఖర్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. అటు జనసేన-బీజేపీలు కూడా పోటీకి సిద్ధమవుతన్నాయి. రెండు పార్టీలు చర్చించిన అనంతంరం ఉమ్మడి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో దిగిన నేపథ్యంలో బద్వేలులో ఆ అవకాశం జనసేనకు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

    ఇది చదవండి: పవన్ కంటే ఒకరోజు ముందే రాజమండ్రికి చిరంజీవి... కారణం ఇదే..!


    అక్టోబర్ 30న పోలింగ్
    2019లో బద్వేలులో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8, ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. తిరుపతి ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బద్వేలు ఉపఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించనుంది.
    Published by:Purna Chandra
    First published: