Somu Veerraju: బద్వేలు పోరుకు బీజేపీ సై.. జగన్, చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (Andhra Pradesh Politics) వేడెక్కిస్తోంది. బద్వేలు బరిలో నిలిచేందుకు భారతీయ జనతాపార్టీ (Bharatiya Janatha Party) సిద్ధమవుతోంది.

  • Share this:
    కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (Andhra Pradesh Politics) వేడెక్కిస్తోంది. బద్వేలు బరిలో నిలిచేందుకు భారతీయ జనతాపార్టీ (Bharatiya Janatha Party) సిద్ధమవుతోంది. మిత్రపక్షం జనసేన (Janasena Party) పోటీ నుంచి తప్పుకున్నా బీజేపీ మాత్రం అభ్యర్థిని నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) కడప జిల్లాలో పర్యటించారు. ఉపఎన్నికల్లో పోటీపై కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతల నిర్ణాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం జగన్ కు భయపడే ప్రసక్తే లేదన్న సోము వీర్రాజు.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ ను పాలిస్తోందని బీజేపీనేనని.. అభివృద్ధే తమ అజెండా అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

    స్టిక్కర్ల ప్రభుత్వం
    బద్వేలులో రెండు జాతీయ రహదారులను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే వేసిందని సోము వీర్రాజు తెలిపారు. పథకాలు,నిధులు కేంద్రానివి అయితే.. స్టిక్కర్లు మాత్రం వైసీపీవి అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని నిధులను, అన్ని పథకాల డబ్బులు సీఎఫ్ఎంఎస్ అకౌంట్లో వేస్తున్న సీఎం జగన్.., ఈ డబ్బును చూపించి అప్పులు చేస్తున్నారని ఆరోపించారు.

    ఇది చదవండి: బద్వేలులో పోటీకి బీజేపీ సై..? పవన్ సపోర్ట్ చేస్తారా..?


    జగన్, చంద్రబాబుకు సవాల్..
    ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనేనని... ఈ అంశంపై ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. అమరావతి నిర్మించాలని ప్రపంచ దేశాలు తిరిగిన చంద్రబాబు.., 3 రాజధానులు అన్న జగన్ మాటలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. ఇద్దరికీ ప్రచారంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. అమరావతిలో 1800 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించిన ఘనత బీజేపీదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని.. దేశంలో మాట చెప్పి మడమ తిప్పని ఏకైక వ్యక్తి మోడీ మాత్రమేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పేరిట వైసీపీ నేతలు వేల కోట్లు నొక్కేశారని ఆయన ఆరోపించారు. జాబ్ కార్డుల ద్వారా కుటుంబానికి 18 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందన్నారు. బద్వేలు

    ఇది చదవండి: ఆ విషయంలో వైసీపీకి జనసేన సపోర్ట్.. స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్..



    నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని.. అభివృద్ధి చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పచ్చిసారాను సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించే పార్టీలు బీజేపీ, జనసేన మాత్రమేని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బద్వేలులో పోటీకి దూరంగా ఉంటామని.. వైసీపీ ఏకగ్రీవానికి ప్రయత్నించుకోవాలని మిత్రపక్షం జనసేన ప్రకటించిన నేపథ్యంలో.. బీజేపీ మాత్రం పోటీకి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: