Home /News /andhra-pradesh /

TIRUPATI ANDHRA GIRL MARRIED AMERICAN YOUNG MAN IN TELUGU TRADITION IN TIRUPATI FULL DETAILS HERE PRN TPT

Tirupati: అమెరికా కోడలిగా ఆంధ్రా అమ్మాయి.. తిరుపతిలో ఇంట్రెస్టింగ్ మ్యారేజ్..!

హర్షవి, ఫ్రాంక్ దంపతులు

హర్షవి, ఫ్రాంక్ దంపతులు

Tirupati: ఇద్దరి ఉద్యోగాలు ఒకే సంస్థలో కావడంతో రచూ మాట్లాడుకునేవారు. అలా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఓ మంచి రోజున ఒకరికొకరు నచ్చినట్లు నిర్ణయించుకున్నారు. ఇంకేముంది లవ్ ఇన్ అమెరికా స్టోరీ స్టార్ట్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    GT Hemanth Kumar, News18, Tirupati

    ప్రేమ (Love) కు కులం, మతం, ప్రాంతం అవసరం లేదు. రెండు మనసులు కలిసి.. ఇద్దరి భావాలు ఒకటైతే చాలు. సప్తసముద్రాల అవతలున్నవారు కూడా కలిసి మెలసి జీవిస్తారు. ఈ రోజుల్లో ప్రేమకు దేశాలు కూడా అడ్డురావడం లేదు. ఎదుటివ్యక్తిపై నమ్మకం కుదిరితే చాలు. మన దేశంతో పనిలేది.. మన భాషచో పనిలేదు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవడమే. సాధారణంగా అమెరికా(America) అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి అనే మాట మనం తరచుగా వింటుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మన ఆంధ్రా అమ్మాయి.. అక్కడి నుంచి తల్లిదండ్రుల కోసం అల్లుడ్ని తీసుకొచ్చింది. తొలుత అమ్మాయి చేసిన పనికి షాక్ తిన్న ఆమె తల్లిదండ్రులు.. ఆ తర్వాత అల్లుడుగారిని సాదరంగా ఆహ్వానించారు. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి (Marriage) చేయించి.. అమెరికాకు కోడలిగా పంపారు.

    వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) కి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె టి.హర్షవి బీటెక్‌ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్‌ మహా నగరంలోని అత్‌హెనా హెల్త్‌ అనే సంస్థలో ఉద్యోగంలో చేరింది అదే సంస్థలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న అమెరికాకు చెందిన డామియన్‌ ఫ్రాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఉద్యోగాలు ఒకే సంస్థలో కావడంతో రచూ మాట్లాడుకునేవారు. అలా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఓ మంచి రోజున ఒకరికొకరు నచ్చినట్లు నిర్ణయించుకున్నారు.

    ఇది చదవండి: ఈ కోటలోని అడుగు పెడితే రాయలవారి కాలానికి వెళ్లినట్లే.. అక్కడున్న అద్భుతాలు, రహస్యాలెన్నో..!


    ఇంకేముంది లవ్ ఇన్ అమెరికా స్టోరీ స్టార్ట్ అయింది. ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. ఇద్దరూ జీవితాంతం కలిసిమెలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తిరుపతిలోనే తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. తొలుత పెళ్లిని అమెరికాలో నిర్వహించాలని భావించినా.. ఆ తర్వాత హర్షవి తల్లిదండ్రులు తమ చేతుల మీదుగా ఇక్కడే పెళ్లి చేస్తామని పట్టుబట్టారు.



    దీంతో అబ్బాయి ఫ్రాంక్.. తన కుటుంబ సభ్యులతో సహా తిరుపతిలో వాలిపోయాడు. వియ్యాలవారికి మన మర్యాదలు చూపించి హర్షవి కుటుంబ సభ్యులు.. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహంకు పెళ్ళి కుమారుడు తండ్రి స్కాట్ బుషార్డ్, తల్లి అన్నా బుషార్డ్, పెళ్ళి కుమారుడి తమ్ముడు, అతని భార్య హాజరయ్యారు. అందరూ తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి మురుసిపోయారు. ఇక అందరి సమక్షంలో ఆమెరికా అబ్బాయి.. ఆంధ్రా అమ్మాయికి పెళ్లి జరిగింది. అంతేకాదు అప్పగింతల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆమెరికా కోడలిగా పంపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: America, Andhra Pradesh, Marriage, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు