GT Hemanth Kumar, News18, Tirupati
ప్రకృతిని ప్రేమించడమే నిజమైన యజ్ఞం అంటున్నాయి పురాణ ఇతిహాసాలు. సమృద్ధిగా వర్షాలు కురావాలన్నా., మానవులు ఆరోగ్యకరంగా ఉండాలన్న సమతుల్యంగా ఉండాల్సింది పర్యావరణమే. పురాతన కాలం నుంచి యజ్ఞాయాగాదులు చేసి.. సకాలంలో వర్షం కురిసేలా చేసేవారు మహర్షులు. అలనాటి రాయలసీమను ఏలిన రాజులు., వారి కుమారులు.. ఓ వైష్ణవ ఆలయాన్ని యాగశాలగా నిర్మించారు. రాయల వారి పూర్వీకుల సంస్థానం నుంచి ఓ వెలుగు వెలిగిన ఆ ఆలయం నేడు శిధిలమై కన్నీరు పెడుతోంది. భావి తరాలకు అందాల్సిన శిలాశాసనాలు.. పాశస్త్యం ధ్వంసమై గుప్త నిధుల వేటకు బలైపోతోంది. గుప్త నిధులు, రాయలవారికోటకు సమీప ప్రాంతం కావడంతో నిధి నిక్షేపాల కోసం ఆలయం పై కప్పు నుంచి ఆలయ అంతర్భాగం వరకూ త్రవ్వకాలు యథేచ్చగా చేసేస్తున్నారు కొందరు దొంగలు. ఇప్పటికే ఆలయంలోని చాలా భాగాలు పడగొట్టి నిధుల వేటగాళ్ళు శిధిలంమైఉన్న ఆలయాన్నిపూర్తిగా నేల పాలు చేయాలని యోచిస్తున్నారు. ఆ ఆలయం యొక్క ఘన చిత్ర విని ఇక్కడి పరిస్ధితి చూస్తే ప్రతి హిందువు కన్నీరు పెట్టకుండా ఉండలేరు.
అలనాటి రాజుల కాలంలో లోకక్షేమం., వర్షాభావ పరిస్థుల నెలకొన్న సమయంలో ఎన్నో యాగాలు చేసేవారు. అలాంటి యాగాలకు అనువైన ప్రదేశం కావాలి. అక్కడ యాగాలు చేస్తే లోకంలోని సమస్త ప్రాణులకు క్షేమం కలిగించే ప్రదేశంగా ఉండాలని. అలాంటి ప్రదేశంగా తిరుపతి (Tirupati) కి 25 కిలోమీటర్ల దూరంలోని ఎగువరెడ్డివారిపల్లెకు గుర్తింపు ఉంది. క్రీస్తు శకం. 12 శతాబ్ధం నుండి 14 శతాబ్ధం మధ్య కాలంలో రాయలవారి కోటకు సమీపంలో ఎత్తైన గోపురం సుందరమైన ధ్వజస్థంభం యొక్క ఆనవాళ్లు నేటికీ పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయులు తండ్రిగారైన సాలువ నరసింహులు యజ్ఞయాగాదులకోసం అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఎగువ రెడ్డి వారిపల్లెగా ప్రాచుర్యం పొందిన ప్రాంతంలోఅత్యంత అద్భుతమైన శిలా రూపాలతో దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు.
శ్రీవారి మెట్టు మార్గానికి అతిసమీపం ఉన్న ఈ రాజా గోపురం 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఓ వెలుగు వెలిగింది. ఇప్పటి టెక్నాలజీతో సైతం కట్టలేనంత ఎత్తైన రాజ గోపురం. ఎలాంటి ఆధునిక పరికరాలు లేకున్నా అప్పట్లోనే ఎన్నో రాతి విగ్రహాలు తోరణాలు, శ్రీ వేంకటేశ్వరుని దశావతారం చెక్కిన ఆనవాళ్ళు ఆ ఆలయంపై ఇప్పటికీ ఉన్నాయి. ఎత్తైన ఏక శిలా ద్వారం చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఎంతో సుందరమైన కట్టడం, మరో ఎంతో అద్భుతమైన ఆలయం నేడు శిధిలా వ్యవస్ధకు చేరుకుంది.
ఆలయ చరిత్ర ఎంచెపుతోంది..?
రెండు కొండల మధ్య నరసింహ స్వామి ఆలయం, యాగ శాలాగా పేరుగాంచిన అద్భుత ఆలయం అని అంటున్నారు పరిశోధకులు. ఆలయం నుంచి కొంత దూరంలో స్వర్ణముఖి నధికి ఉప నది అయినా భీమా నది ఇక్కడ ప్రహించేదట. ఆ నది ప్రవాహానికి శ్రీనివాస మంగాపురం, నరసింహ స్వామి ఆలయాలకు బీటలు వచ్చాయని పరిశోధకులు చెప్తున్నారు. కొట్టాల స్థలం అయినా ఈ ఆలయానికి వంటలు చేసే పోటు, మహా రాజా గోపురం, ధ్వజస్థంభం, మండపాలు అన్ని ఉండేవి. ఇక ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలకు బావి ఉంది. ఓ ఆలయానికి కావాల్సిన సర్వ హంగులు ఉన్న ఆలయం అది.
ఈ ఆలయానికి వెనుక భాగంలో శివాంశలో ఉన్న గుర్రప్పా దేవుని ఆలయం ఉంది. అప్పట్లో ఇక్కడే ఉంటూ తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లేవారట ఆలయ అర్చకులు. ఇక్కడనుంచి శ్రీవారి నడకమార్గం గుండా తిరుమలకు వెళ్లి అర్చకులు వేదపారాయణం చేసి వచ్చేవారట. అలా కైంకర్యాలు చేసే అర్చకులు ఇక్కడే బస చేసి ఉండేవారట. అందువల్ల ఈ స్థలాన్ని కొట్టాల అని అనే వారని అంటున్నారు పరిశోధకులు.
టిప్పు సుల్తాన్ తండ్రి అయినా హైదర్ అలీ నిధుల వేటలో ఎన్నో ఆయాలు ద్వాంసం చేశాడు. అలా వచ్చిన హైదర్ అలీ వకుళామాత ఆలయం, శ్రీనివాస మంగాపురం, కొట్టాల నరసింహ స్వామి వారి ఆలయం ధ్వసం చేసి అక్కడ నిధులు దోచుకెళ్ళారట. హైదర్ అలీ నాశనం చేసిన ఆలయం యొక్క ఆనవాళ్లు ఇప్పటికి ఆ ప్రాంతంలోనే కాకుండా... ఎస్వీ యూనివర్సిటీ లోను ఉన్నాయి. మహ్మదీయులు., బ్రిటిష్ వారు దోచుకున్న అనంతరం... సమీప ప్రాంతంలో నివసిస్తున్న కొందరు గుప్తా నిధుల వేటగాళ్ల కన్ను ఈ ఆలయంపై పడింది. ఊరిలోని ప్రజలు ఇరు వర్గాలుగా చీలిపోయి... కొందరు గుడి పరిరక్షణ కోసం ఎదురు చూస్తుంటే మరి కొందరు....లోపల నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయని భావించి ఆలయాన్ని పూర్తిగా కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయం., ధ్వజస్థంభం పూర్తిగా నేలమట్టం కాగా... రాజా గోపురం రేపో మాపో కూలిపోయేలా ఉంది. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ., రాష్ట్ర దేవాదాయ శాఖా చొరవ చూపి ఆలయాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు స్థానికులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Hindu Temples, Tirupati