హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: కొడుకు పేరుతో 11కేజీల బంగారం దానం.. అక్కడే ఉంది అసలు తిరకాసు..

Andhra Pradesh: కొడుకు పేరుతో 11కేజీల బంగారం దానం.. అక్కడే ఉంది అసలు తిరకాసు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈ మోసగాళ్లు కొత్త దారి వెతుకున్నారు. కేవలం డబ్బులు కాజేయాలకున్న వారి ప్లాన్ పక్కాగా అమలు చేసారు. నిధిపేరు చెప్పి అడ్డంగా దోచేశారు.

  నేటి మార్కెట్లో బంగారానికి ఎంతో విలువ ఉంది. బంగారం ధరలు ప్రతిరోజూ ఇంటర్ నెట లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక మహిళలకు బంగారం అంటే ఉండే ప్రేమ అంతాఇంతా కాదు. ఐతే బంగారంపై మోజుతో మాయగాళ్ల వలలో పడి మోసపుతున్న వారి సంఖ్యా రోజు రోజుకి పెరుగుతోంది. బయట వ్యక్తులను మోసం చేస్తే సర్వసాధారణంగా జరుగుతున్న తంతే... కానీ ఈ మోసగాళ్లు కొత్త దారి వెతుకున్నారు. కేవలం డబ్బులు కాజేయాలకున్న వారి ప్లాన్ పక్కాగా అమలు చేసారు. సొంతబంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లని అడ్డంగా మోసం చేశారు. డబ్బులు ఊరికే రావు.., బంగారు మార్కెట్ లోని ధరలకంటే తక్కువకు రావు. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.4700/-రూపాయలు ఉండగా.., తక్కువ ధరకే బంగారు ఇస్తామంటే ఎవరైనా వలలో పడాల్సిందే. ఇదే సూత్రంతో మోసం చేసారు అనంతపురం జిల్లాలో భార్య భర్తలు. లక్షకాదు, రెండు లక్షలు కాదు ఏకంగా కోటి యాభై లక్షల వరకు.. తమకు దూరపు బంధువులు, చుట్టాల నుంచి దండుకుని బిచాణా ఎత్తేశారు.

  అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం, వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రలలో బంగారు లభించిందని తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలని, అయితే ఈ దొరికిన బంగారాన్ని మామూలు బంగారంగా మార్చడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చుట్టుపక్కల ప్రాంతాలలోని తమ కుటుంబ సభ్యులకు, తెలిసిన వ్యక్తులతో నమ్మబలికారు. సాధారణ బంగారంలో మార్చిన అనంతరం ఇచ్చిన డబ్బుకు బంగారం లేదా.. రెండింతలు బంగారం ఇస్తామని నమ్మించారు. ఇలా దాదాపు ముప్పై రెండు కుటుంబాల వరకు ఒక్కో కుటుంబంతో రెండు లక్షల నుంచి 5 లక్షల చొప్పున మొత్తం కోటిన్నవరకు వసూలు చేశారు.

  నిందితులు ఇచ్చిన నకిలీ బంగారం, నకిలీ నగదు

  ఇది చదవండి: సాఫ్ట్ వేర్ ఉద్యోగంకంటే ఎక్కువ సంపాదన.. ఈ యువరైతు ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు..


  ఇదిలా ఉంటే ఓ రోజు కర్నూలు నుంచి బంగారు డబ్బులు తీసుకు వస్తున్నామని ఒక ఇంటిలో వాటిని ఏర్పాటు చేసి అమ్మ వారి ప్రసాదం తీసుకోవాలని అక్కడున్న 15 మంది బాధితులకు పంచి పెట్టగా మత్తు మందు కలపడంతో వారు నిద్రలోకి జారుకున్నట్లు బాధితులు తెలిపారు. ఈ సమయంలో నకిలీ బంగారాన్ని దొంగ నోట్ల కట్టలను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయినట్లు చెప్పారు. నిద్ర నుంచి మెలకువ వచ్చేసరికి వాటిని చూసి నిరిర్వ పోయామన్నారు. ఇదేమిటని ప్రశ్నించగా తాము అసలైన బంగారమే ఇచ్చామని.. తన తప్పేమీ లేదని బుకాయించినట్లు వివరించారు. దంపతుల మోసంపై పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదని అనంతపురంలో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ను కలిశారు.

  ఇది చదవండి: ఏపీలో మందుబాబుల మనసు మారిందా..? మరి ఈ సడన్ ఛేంజ్ ఏంటీ..?


  తమ పొలాలు, ఇల్లు తాకట్టు పెట్టి వారికి డబ్బులు ఇచ్చామని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ నయా దందాలో మొత్తంగా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating

  ఉత్తమ కథలు