కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఆయుర్వేదం మందు మాత్రమే మార్గమని కిస్కింద హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామిజీ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆనందయ్య అనే వైద్యుడు తయారు చేసిన మందు కరోనాను నిర్మూలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయుర్వేద గ్రంధాల్లో ఉన్న విధంగా ఆనందయ్య మందు తయారు చేశారని అన్నారు. ఆనందయ్య తయారు చేసిన మందులో ఎటువంటి లోపాలు లేవని వ్యాఖ్యానించారు. ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రజల ప్రాణాలకు హానికరం కాదని స్పష్టం చేశారు. ఆరు నెలలుగా కర్ణాటకలో ఆయుర్వేద మందుపై వైద్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఈ మందు వాడడంలో సంశయానికి గురికావద్దని గోవిందానంద ప్రజలకు సూచించారు.
ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రజలకు అందేలా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోరారు. ఆయుర్వేద మందుపై ఏపి సీఎం నెల్లూరుకు వచ్చి త్వరగా మందు పంపిణి జరిగేలా దృష్టి సారించాలని అన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోవిందానంద.. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మొదట టీటీడీ అధికారులు, వేదపండితులతో ఆయన సమావేశమయ్యారు.
కరోనా వ్యాధి పూర్తిగా అంతం కావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించేందుకు తిరుమలకు చేరుకున్నానని ఆయన తెలిపారు. త్వరలోనే హనుమన్ జన్మస్ధలంపై చర్చకు వస్తామని తెలిపారు. మరోవైపు హనుమ జన్మభూమి వివాదం సాగుతున్న నేపథ్యంలో గోవిందానంద సరస్వతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.