Home /News /andhra-pradesh /

TIRUPATI ALLEGATIONS ON CASHEW AND GHEE SUPPLIER TO TIRUMALA TIRUPATI DEVASTHANAM FULL DETAILS HERE PRN TPT

TTD News: టీటీడీలో మరోసారి జీడిపప్పు వివాదం.. ప్రసాదం క్వాలిటీపై భక్తుల ఆగ్రహం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు నైవేద్య ప్రియుడు. నిత్యం శ్రీవారికి వివిధ అన్నప్రసాదాలతో పాటుగా లడ్డు., పిండి వంటలను నివేదన చేస్తారు ఆలయ అర్చకులు. స్వామి వారికీ సమర్పించే ఎంతో నైవేద్య ప్రసాదాలను నాణ్యతలో రాజీ లేకుండా.. ప్రసాదం తయారీ ఉంటుంది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)  శ్రీవేంకటేశ్వరుడు నైవేద్య ప్రియుడు. నిత్యం శ్రీవారికి వివిధ అన్నప్రసాదాలతో పాటుగా లడ్డు., పిండి వంటలను నివేదన చేస్తారు ఆలయ అర్చకులు. స్వామి వారికీ సమర్పించే ఎంతో నైవేద్య ప్రసాదాలను నాణ్యతలో రాజీలేకుండా.. ప్రసాద తయారీ ఉంటుంది. ఒక్క దిట్టంతో సమర్పించే లడ్డుప్రసాదం నుంచి అన్నిటిలోను జీడిపప్పు అధికంగా వినియోగిస్తారు. ఎన్ని ప్రసాదాలు చేసిన అందులోని జీడిపప్పు లేకుండా పోతే అంత రుచిగా ఉండదు. అందుకే శ్రీవారి నివేదనకు అత్యంత నాణ్యమైన జీడీ పప్పును వినియోగిస్తుంది టీటీడీ (TTD). ఇలా శ్రీవారికి తాయారు చేసే ప్రసాదాలు రోజుకు 2,600 కిలోల జీడిపప్పు అవసరం అవుతుంది. శ్రీవారికి తయారు చేసే ప్రసాదాలకు కావలసిన ముడి సరుకుల కొనుగోలుకు టీటీడీ ఆన్లైన్ ఈ ప్రొక్యూమెంట్ ద్వారా టెండర్లకు పిలుస్తుంది.

  నిత్యం స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాలు, అన్నదానం, అనుబంధ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కావాల్సిన ముడిసరుకుల కొనుగోలుకు టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ టెండర్ల కోసం భారీగానే పోటీ ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వారికే టెండర్ కట్టబెడతారు. టెండర్ దక్కించుకున్న సంస్థలు రెండేళ్లపాటు ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకులు సరఫరా చేస్తాయి. ఇలా జీడీపప్పు, కంది, ఉద్ది, ఇతర పప్పులు ధాన్యాలు సరఫరా చేస్తాయి. ప్రసాదాల తయారీలో ఏ1 గ్రేడ్ సరుకులను మాత్రమే టీటీడీ వినియోగిస్తూ వస్తుంది.

  ఇది చదవండి: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!


  వచ్చిన ముడి సరుకును తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో పరీక్షిస్తుంటారు. అక్కడ పూర్తిస్థాయిలో నాణ్యత ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ముడి సరుకును ఉగ్రాణం., గౌడన్ కు తరలిస్తారు. ఇదంతా బాగానే ఉన్న టీటీడీ షరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ గుర్తించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగా లేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాసన బాగా రావడం లేదని వీటిని ప్రభుత్వ పరీక్ష కేంద్రానికి పంపాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిని పరిశీలించి.., వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: ఇంటర్నెట్ ఎంతపని చేసింది..! గోదారి గట్ల వెంట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పరుగులు


  స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు ఏటా రూ 500 కోట్లు ఖర్చు చేసి జీడిపప్పు, నెయ్యి, యాలకులు కోనుగోలు చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేశానని ఆయన వివరించారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.

  ఇది చదవండి: పసుపు రంగు పుచ్చకాయల్లో అంత పవరుందా..? ఎగబడుతున్న జనం..


  దీంతో ఇప్పుడు తీసుకున్న జీడిపప్పును నాణ్యతను ఎవరు నిర్ధారించారనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి దీనిని తీసుకునే ముందు తేమ 5 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. పొరుగు సేవల సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వ హిస్తున్నారని, అక్కడ సరిగ్గా పరీక్షలు నిర్వహించట్లేదని ఆరోపణలు వస్తున్నాయి.

  ఇది చదవండి: ఇకపై ఆంధ్రాలో చికెన్ దొరకదా..! త్వరలోనే లాక్ డౌన్..? కారణం ఇదే..


  తితిదేకు గతంలో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ నుంచి వచ్చే జీడి పప్పులో సరైన నాణ్యత లేదని గుర్తిస్తూ వచ్చినా దాన్ని ఎందుకు పక్క నపెట్టలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తితిదే అధికారులే దీన్ని నిర్ధారిస్తూ వచ్చారు. నాసిరకం సరకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అయినా ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఆ తర్వాత అధికారులు టెండరు ప్రక్రియ చేపట్టి జీడిపప్పు ఒక్కో కిలోకు రూ.831కి టెండరు కట్టబెట్టారు. ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి జీడిపప్పును కొనుగోలు చేస్తూ వస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

  తదుపరి వార్తలు