హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాటు..? ముఖ్య ఘట్టాలు ఇవే..

Tirumala: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్.. బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాటు..? ముఖ్య ఘట్టాలు ఇవే..

ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్

ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్

Tirumla: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ఏ ఘట్టం జరుగుతుందో తెలుసా.. వాటి ప్రత్యేకతలు ఇవే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  CM ys jagan to visits tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ((Lord Venkateswara Swamy) ) కొలువై ఉన్న తిరుమల (Tirumala) లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రకటించింది. రెండున్నరేళ్ల తరువాత తొలిసారి సామాన్యులకు పెద్ద పీట వేస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి అవుతున్నాయి. అయితే ఈనెల 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Darma Reddy). 28వ తేదీన సీఎం చేతులమీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం జరగుతుందని చెప్పారు.  దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో సమయంలో విజయదశమి వరకు నవాహ్నికంగా నిర్వహించే ఉత్సవాలనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) ఏర్పాట్లు చేపడుతోంది.

  ఈ తొమ్మిది రోజుల ఉత్స‌వాల్లో శ్రీ‌వారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామివారు వివిధ ర‌కాలైన 16 వాహ‌నాల‌పై (రెండు ర‌థాలు క‌లిపి) మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మైన కార్యక్రమాల సరళి ఈ విధంగా ఉంటుంది. 

  ఆలయశుద్ధి :

  బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వైఖాన‌స ఆగ‌మం ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి (కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం) చేస్తారు.

  ఇదీ చదవండి : రైతులకు సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. బరువు తగ్గాలనుకున్నవారికి దివ్య ఔషధం

  మృత్సంగ్రహణం :

  బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందునాడు పుట్టమన్ను సేకరించి భూమాతకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు  మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. తదుపరి విష్వక్సేన, అనంత, సుదర్శన, గరుడాళ్వార్‌లను పూజిస్తారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రతి స్కూళ్లో ఏర్పాటు..

  ధ్వజారోహణం మరియు దేవతావాహనం:

  శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయం లోపల నడిమి పడికావలి చెంత అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి అత్యంత ప్రియు సఖుడైన గరుడుడు బ్రహ్మ, ఇంద్ర, యమ, అగ్ని, కుబేర, వాయు తదితర దేవతలనే కాకుండా వశిష్ట, విశ్వామిత్రాది సప్తఋషులను, ఇతర గణాలను, దేవతలను ఆహ్వానిస్తారని ప్రతీతి. దీనినే దేవతావాహనం అంటారు.

  ఇదీ చదవండి : వేల కోట్ల భూముల కబ్జాకు స్కెచ్.. జనసైనికుల ఫిర్యాదుతో వెలుగులోకి భారీ స్కామ్..!

  వాహనసేవలు :

  శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వన్నె చేకూర్చేవి వివిధ వాహనసేవలు. అలంకార తేజోవిలాసుడైన శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలు క‌లిపి 13 వాహనాలపైనే కాకుండా మోహినీ అవతారం, స్వర్ణరథం, రథోత్సవాల్లో కూడా తిరుమాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు. ఒక్కొక్క వాహనం ద్వారా భక్తజన కోటికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు.

  ఇదీ చదవండి: పొలం పని చేసుకుని ఇంటికి వచ్చిన అన్నకు షాక్.. తమ్ముడితో భార్యను అలా చూసి.. ఏం చేశాడో తెలుసా?

  శ్రీవారి కొలువు :

  శ్రీవారి ఆలయం లోపల బ్రహ్మోత్సవాల వాహనసేవల సమయంలో కొలువు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ అర్చకులు ఈ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు.

  ఇదీ చదవండి : జనసేనలోకి వైసీపీ కీలక నేత.. ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్

  స్నపనం :

  ఈ కార్యక్రమాన్నే ఉత్సవానంతర స్నపనంగా వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం ఒక వాహనసేవ తిరిగి రాత్రి ఒక వాహనసేవతో క్షణం తీరిక లేకుండా ఉండే మలయప్పస్వామివారికి రెండు వాహనసేవల మధ్య సమయంలో నిర్వహించే ప్రత్యేక సుగంధద్రవ్య అభిషేకమే స్నపనం. తద్వారా స్వామివారికి ఉపశమనం కలిగించి తిరిగి రాత్రి వాహనానికి నూతనోత్తేజంతో, ఉత్సాహంతో వాహనాన్ని అధిరోహించేందుకు సంసిద్ధం చేస్తుంది.

  ఇదీ చదవండి : కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు.. అది చంద్రబాబు కుట్రే అంటూ ఆరోపణ

  చూర్ణాభిషేకం:

  బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజు ఉదయం స్వామి, అమ్మవార్లకు సుగంధద్రవ్యంతో ఆచరించే స్నానమే చూర్ణాభిషేకం.

  ఇదీ చదవండి: నగరికి దూరమయ్యారా..? ఏపీకి బైబై చెప్పారా..? దివ్యావాణి బీజేపీలో చేరుతారా..? ఆమె ప్లాన్ ఏంటి..?

  చక్రస్నానం:

  బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి పుష్క‌రిణిలో శ్రీవారి సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు.

  ఇదీ చదవండి: టీటీడీలో కొలువు కావాలా..? చేయి తడిపితే చాలు అంటున్న ఉద్యోగి.. రేటు ఎంతంటే?

  దేవతోద్వాసన :

  చివ‌రిరోజు స్వామివారికి అర్చన నివేదించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముక్కోటి దేవతలకు, ఋషిపుంగవులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు ప‌లుకుతారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించిన బ్రహ్మదేవునికి కూడా అర్చకస్వాములు సంబంధిత శ్లోకాల‌తో కృతజ్ఞతలను నివేదిస్తారు.

  ఇదీ చదవండి: కొడాలి వర్సెస్ దగ్గుబాటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కారణం అదే..?

  ధ్వజావరోహణం:

  బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం ధ్వజావరోహణం. ఆలయ ధ్వజస్తంభంపై తొలిరోజు రెపరెపలాడిన గరుడధ్వజ చిత్రపటాన్ని చివరిరోజు సాయంత్రం అవనతం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Tirumala, Ttd news