హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Brahmotsavalu: భక్తులకు అలర్ట్.. సిఫార్సు లేఖలు రద్దు.. నూతన పరకామణి భవనం ప్రారంభించనున్న సీఎం

Brahmotsavalu: భక్తులకు అలర్ట్.. సిఫార్సు లేఖలు రద్దు.. నూతన పరకామణి భవనం ప్రారంభించనున్న సీఎం

ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

Brahmotsavalu: కలియుగ దైవం శ్రీ వెంటకేశ్వర స్వామి భక్తులను దర్శించుకోవాలి అనుకునే వారికి అలర్ట్.. సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అలాగే ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభమవుతుందన్నారు. ఆ ఏర్పాట్లను పరిశీలించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  Brahmotsavalu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను.. ఈ సారి భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలపై ఫోకస్ చేస్తున్నారు. 

  మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.. అనేక మంది భక్తులతో అన్న ప్రసాదం రుచి, నాణ్యత, వడ్డిస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.అంతే కాకుండా కల్యాణకట్ట, దర్శనం, వసతికి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగారా అని టిటిడి ఛైర్మన్ ఆరా తీశారు. తరువాత భక్తులతో కలిసి భోజనం చేశారు.

  తరువాత బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మాట్లాడారు. గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయాం.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది..  భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాంమన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.

  ఈ ఏడాది భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని.. అందుకే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో‌ సిఫార్సు లేఖలపై ఎలాంటి దర్శనాలను అనుమతించడం లేదన్నారు.. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడమే తమ లక్ష్యమని.. అందుకుతగ్గ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.

  ఈ నెల సెప్టెంబరు 27వ తేదీ‌ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం‌ జరిగిందన్నారు. గత రెండేళ్ళుగా బ్రహ్మోత్సవాలు కోవిడ్‌ కారణంగా నిర్వహించలేక పోయాంమని, ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

  భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రంను తనిఖీ చేసి భక్తులతో కలిసి భోజనం స్వీకరించడం జరిగిందన్నారు. భక్తులకు టిటిడి అందిస్తున్న సేవల గురించి అడిగితే.. అత్యంత అద్భుతంగా సేవలు ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారని గర్వంగా చెప్పారు.

  స్వామి వారి దర్శన విషయంలో త్వరితగతిన భక్తులకు దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాంమని చెప్పారు.. ఈ‌నెల 27 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, వాహన సేవలో పాల్గొంటారని.. ఆ మరుసటి రోజు నూతన పరకామణి భవనంను సీఎం‌ ప్రారంభించనున్నారని ప్రకటించారు. 

  బ్రహ్మోత్సవాల సమయంలో ప్రజాప్రతినిధులు, పాలక మండలి‌సభ్యులు, అధికారుల సిఫార్సు లేఖలపై దర్శ కేటాయింపు రద్దు చేయడం‌ జరిగిందని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి‌ సహకరించాల్సిందిగా టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం 12 వేల వాహనాలకు మాత్రమే కొండపై అనుమతి ఉంటుందన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhrapradesh, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news, YV Subba Reddy

  ఉత్తమ కథలు