TTD Alert: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) భక్తులకు అలర్ట్.. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు (Calenders), డైరీ (Daries) లను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం టీటీడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులోకి వచ్చాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతి (Tirupati) లోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర గల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి. దీంతో పాటు విజయవాడ (Vijayawada), వైజాగ్ (Vizag), హైదరాబాద్ (Hederabad), చెన్నై (Chennia), బెంగళూరు (Bangalore), న్యూఢిల్లీ (New Delhi), ముంబయి (Mumbai) లోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.
కేవలం ప్రధాన నగరాల్లోనే కాదు.. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుడి కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు , రాజమండ్రి , కాకినాడ , కర్నూలు , నంద్యాల, హనుమకొండలోని టిటిడి కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు
టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ కామర్స్ సంస్థల ద్వారా మాత్రమే కాదు.. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో ”పబ్లికేషన్స్”ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. టీడీడీ క్యాలెండర్లు, డైరీలు తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్ చేసుకుంటున్నారు.
డీడీ తీసి పంపొచ్చు..
భక్తులు డీడీ తీసి పంపినా టీడీడీ క్యాలెండర్, డైరీలను పొందవచ్చు. ‘‘ఇందుకోసం కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ప్రయివేటు ట్రాన్సుపోర్టు ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికైనా క్యాలెండర్, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కావాలి అంటే..? 9963955585, 0877-2264209 నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి : నేటితో ముగుస్తున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. ఆదివారం అశ్వవాహనంపై అమ్మవారి దర్శనం..
12 పేజీల క్యాలెండర్ ధర: రూ.130
డీలక్స్ డైరీ ధర: రూ.150
చిన్న డైరీ ధర: రూ. 120
టేబుల్ టాప్ క్యాలెండర్ ధర: రూ.75
శ్రీవారి పెద్ద క్యాలెండర్ ధర: రూ.20
శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ ధర: రూ.20
శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ ధర: రూ.15
తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర: రూ.30
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వీటి ధర కంటే సర్వీస్ చార్జ్ ఎక్కువ వసూలు చేస్తోంది టీటీడీ.. ఒక్కో డైరీకి 133 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తోంది. అదే బల్క్ లో పది డైరీలు ఒక్కసారి బుక్ చేసుకుంటే 379 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd