Aggipetti Maccha: 'అగ్గిపెట్టి మచ్చా' జోరు మాములుగా లేదుగా.. ప్లే స్టోర్లో మచ్చా రికార్డ్

అగ్గిపెట్టి మచ్చా మొబైల్ గేమ్ సూపర్ హిట్

తన హావభావాలు, తిట్లదండకంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అగ్గిపెట్టి మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ మరో రికార్డ్ సాధించాడు.

 • Share this:
  ిGT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అగ్గిపెట్టి మచ్చా అలియాస్ కిరణ్ ఇతనికి యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. సాధారణ జీవితాన్ని గడిపే కిరణ్… ఓ యాక్సిడెంట్ వల్ల తీవ్ర గాయాలపాలు కావడంతో కొంత మానసిక స్థితి సరిగా లేకపోవడం. ఎదుటి వారు రెచ్చగొడితే బూతు పురాణం అందుకోవడంతో యూట్యూబ్ లోనే కాదు టిక్ టాక్ లోనూ ఫేమస్ అయ్యాడు. ఇతని హావబావాలు, తిట్లదండకం గురించి తెలియని యువకులు తెలుగురాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తికాదు. ఇతనితో ఇంటర్వ్యూ చేస్తే లక్షల వ్యూస్ ఖాయం కావడంతో చాలామంది యూటుబ్ర్స్ ఇతనితో ఇంటర్వ్యూలు చేసి లక్షల్లో వ్యూస్ కైవసం చేసుకున్నారు. మొదట ఆప్యాయంగా నమస్తే అన్నో అంటూ పలకరిస్తాడు. అవతలివాళ్ళు రెచ్చగొడితే ఇంకా అంతే సంగతులు మొత్తం డైలాగ్స్ అన్ని బీప్ పదాలతో నిండిపోతాయి. ఇక అతని చేష్టలు, హావభావాలు, మాట్లాడే విధానం ఊర మాస్ గా ఉండటంతో యూట్యూబ్ లో ఇతనికి ఉన్న ఫాలోయింగ్ వేరప్పా అనాల్సిందే.

  కొన్ని టీవీ షోలలో కూడా అగ్గిపెట్టి మచ్చా ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మచ్చాకు ఆ టివి ఛానెల్, మరి కొందరు యూటుబర్స్ ఆర్థికంగా సహాయం చేసినట్లు సమాచారం. ఇదివరకు మీమ్స్ వాట్స్ ఆప్ స్టికర్ తో మచ్చా తన సత్త చాటాడు. ఇక పేస్ బుక్ లో వచ్చే ట్రోలింగ్ లో మచ్చా కిరణ్ ఫోటో ఎదేచ్చగా వాడేసుకుంటున్నారు మీమ్స్ రాయుళ్లు. ఇలా దేశవ్యాప్తంగా మచ్చా మీమ్స్ స్టిక్కర్స్ వైరల్ గా మారాయి.

  అగ్గిపెట్టి మచ్చా గేమ్

  ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ ఎత్తివేత..? ప్రభుత్వం కీలక నిర్ణయం అప్పుడే...


  అయితే తాజాగా అగ్గిపెట్టి మచ్చా మరో అరుదైన ఘనత సాధించాడు. గూగుల్ ప్లే స్టోర్ లో తనదైన ముద్ర వేశాడు. అగ్గిపెట్టి మచ్చా మీమ్స్ క్యారెక్టర్ పై ఓ గేమ్ ను రూపొందించి ప్లే స్టోర్ లో ఉంచారు. ఎవ్వరు ఊహించని విధంగా ఈ తెలుగు మీమ్ క్యారెక్టర్ గేమ్ అరుదైన ఘనత సాధించడం ఇదే ప్రధమం. "game on aggi petti maccha" అనే ఈ గేమ్ ను గేమ్ ఆన్ మీమ్స్ అనే సంస్థ రూపొందించింది. 21.6ఎంబి సైజ్ గల ఈ గేమ్ లక్షకు పైగా డౌన్ లోడ్స్ ను సొంతం చేసుకుంది. ఇక రేటింగ్ లోనూ 4.4 సాధించిందడం విశేషం. మీమ్స్ క్యారక్టర్ తో మరికొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ ఉన్నా.. తెలుగు నుంచి అగ్గిపెట్టి మచ్చానే టాప్ లో ఉన్నాడు.

  ఇది చదవండి: వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడలేదా...? అయితే ఇలా చేయండి..


  ఇక ఈ గేమ్ విషయానికి వస్తే మారియో గేమ్ ను పోలినట్లు ఉంటుంది. ఒక అరుగు నుంచి మరో అరుగుకు ఎగిరి వెళ్లేలా ఈ గేమ్ ను రూపొందించారు. గేమ్ ప్రారంభం కాగానే నమస్తే అన్న అంటూ మచ్చా వాయిస్ వస్తుంది. ఇక గేమ్ బ్యాక్ గ్రౌండ్ లో కిరణ్ పాడిన పాటను ఉంచారు. "ఏది కరిగిన బంగారు కరిగిన నీ మనసు కరగదమ్మి", గేమ్ ఆడే సమయంలో ఎగిరి తంతా, గేమ్ లో అవుట్ అయిపోతే పోతే పోయింది కానీ ఎదవా ప్రాణం అనే డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న మచ్చా.. ఇప్పుడు ఆన్ లైన్ గేమ్స్ లోనూ హవా చాటడంపై అతని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: