Tirupati Result: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పరువు కాపాడిన పవన్. లేదంటే అదే జరిగేదా? ట్విట్టర్ లో సెటైర్లు

బీజేపీ పరువు కాపాడిన పవన్

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి చేతులెత్తేశారు అన్నట్టు తయారైంది బీజేపీ పరిస్థితి. తిరుపతిలో గెలుపు మాదే అన్నారు.. లేదంటే సెకెండ్ ప్లేస్ పక్కా అన్నారు. కానీ కనీసం 6 శాతం ఓటింగ్ కూడా సాధ్యం కాలేదు. అయితే ఈ పడ్డ ఓట్లు కూడా పవన్ పుణ్యమే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

 • Share this:
  తిరుపతి ఉప ఎన్నిక ఫలితం అంతా ఊహించిందే.. అధికార వైసీపీదే విజయం అని అంతా ముందే అంచనా వేశారు. అయితే మెజార్టీ ఎంత అన్నదానిపై అన్ని పార్టీలు లెక్కలేసుకున్నాయి. ఇక ఏపీలో అడుగు పెట్టాలని ఆరాటపడుతున్న బీజేపీ మాత్రం నెంబర్ టు ప్లేస్ టార్గెట్ గా ఎన్నిక బరిలో దిగింది అన్నది బహిరంగ రహస్యమే.. గెలుపు సంగతి ఎలా ఉన్నా కచ్చితంగా సెకెండ్ ప్లేస్ వస్తుందని లెక్కలు వేసుకుంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలు తిరుపతిలో బాగా కలిసి వస్తాయి అనుకుంది. ఇక టెంపుల్ సిటీ అయిన తిరుమలలో హిందువులంతా ఏకం అనే నినాదాం తమకు కలిసి వస్తుందని ఆశించింది. ఇటు ఏపీలో దేవాలయలు, దేవుడి విగ్రహాలపై దాడి అంశాన్ని హైలైట్ చేస్తూ లభ్ది పొందాలని ఆరాటపడింది. వీటన్నటికన్నా ముఖ్యంగా జనసేన మద్దతు తమకు పెద్ద బూస్ట్ ఇస్తుందని ఆశించింది. యూత్ ఓటర్లు ఎక్కువ ఉండడం.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లతో పాటు.. పవన్ అభిమానులు కచ్చితంగా తమకు అండగా నిలుస్తారని లెక్కలు వేసుకుంది. అందుకే పవన్ తో గట్టిగానే ప్రచారం చేయించింది బీజేపీ అధిష్టానం.. ఇలా ఎన్ని లెక్కలు వేసుకున్నా బీజేపీ డిపాజిట్ దక్కించుకోలేక పోయింది.

  తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 57 శాతం ఓటింగ్ తో..2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపొందారు. గతంతో పోలిస్తే టీడీపీకి ఓట్లు తగ్గిన.. వరుస ఓటముల సమయంలో 32 శాతం ఓటింగ్ తో మంచి ఫలితమే రాబెట్టుకుంది. అందుకే ఆ పార్టీ తమదే నైతిక విజయం అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఏపీలో తామే నెంబర్ 2 అని చెప్పుకుంటున్న బీజేపీకి.. టీడీపీ ఓట్లతో గట్టి సమాధానం చెప్పింది. టీడీపీకి-బీజేపీకి కూడా భారీ తేడా వచ్చింది. ప్రధాన ప్రతిపక్షానికి కాస్త దగ్గర కూడా బీజేపీ రాలేకపోయింది. 5.4 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇది ఆ పార్టీకి గట్టి దెబ్బే. ఎందుకంటే, జనసేనతో పొత్తు పెట్టుకుని తప్పనిసరిగా ఇక్కడ పాగా వేయాలని పావులు కదిపింది బీజేపీ. అయితే, ఇక్కడ వైసేపీ వ్యూహాల ముందు ఆ పార్టీ నిలబడలేకపోయింది.

  ఇంతలా షాక్ తిన్న బీజేపీ పై ఇప్పుడు సోషల్ మీడాయాలో సెటైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ వర్గాల నుంచి మీ_మ్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బీజేపీ ఒక్క రౌండ్ లో కూడా మెజారిటీ కాదు కదా రెండో స్థానంలోకి కూడా రాలేదు. దీంతో బీజేపీ టార్గెట్ గా కౌంటర్లు వెల్లువలా వచ్చాయి. జనసేన అధినే పవన్ కళ్యాణ్.. అతడి సినిమా వకీల్ సాబ్ హిట్టుతో.. కనీసం కమల దళానికి ఈసారి కొంత ఊరట లభించిందని నెటిజన్లు అంటున్నారు. ఊరట ఏంటి అనుకుంటున్నారా? కగ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కంటే ఈ సారి పెరిగాయి అంటున్నారు. గత ఎన్నిక ఫలితంతో చూస్తే ఈ సారి బీజేపీ గెలిచినట్టే అంటున్నారు. గతంలో కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. ఈసారి నోటా ను దాటి బీజేపీ పెర్ఫార్మెన్స్ చేసింది అని నెటిజన్లు మీమ్స్ ను ట్రోల్ చేస్తున్నారు.

  2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటాకు 25,781 ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీకి 20,971 ఓట్లు వచ్చాయి. అంటే బీఎస్పీ ఓట్లు జనసేనవే అని వారంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నోటాకు 11,509ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీకి 43 వేల 317 ఓట్లు వచ్చాయి. అంటే, నోటా కంటె ఎక్కువ. అయితే, ఈ ఓట్లు పవన్ కళ్యాన్ పుణ్యమా అని వచ్చాయి అంటూ.. లేదంటే మళ్లీ నోటానే నెగ్గిది అంటూ సెటైర్లు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ దాదాపు 21 వేల ఓట్లు సాధించింది. ఈసారి బీజేపీ పవన్ తో పొత్తు వల్లే ఆమాత్రం ఓట్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.
  Published by:Nagesh Paina
  First published: