హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుపతి టు తిరుమలకు రోప్ వే సాధ్యమా..? అసలు సమస్య ఏంటేంటే?

Tirumala: తిరుపతి టు తిరుమలకు రోప్ వే సాధ్యమా..? అసలు సమస్య ఏంటేంటే?

తిరుపతి టు తిరుమల రోప్ వే

తిరుపతి టు తిరుమల రోప్ వే

Tirumala: సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.. అసలు తిరుపతి నుంచి తిరుమలకు రోప్ వే నిర్మించడం సాధ్యమేనా..? రోప్ వే నిర్మించడంలో వస్తున్న సమ్యలు ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్ననారు. అందుకే అణువణువునా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలకు ఆధ్యాత్మిక రాజధాని అని పేరు ఉంది. అయితే ఇక్కడి భక్తులకు ఓ కళ కలగానే మిగిలిపోతోంది. కేవలం ఒక నిర్ణయం మరెన్నో అవరోధాలతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కింది. మళ్లీ 20 ఏళ్ళ తరువాత  ప్రాజెక్ట్ పై ఆశలు చిగురిస్తున్నాయి. అదే రోప్ వే ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ కు 2003లో ప్రతిపాదనకు వచ్చింది.

తిరుమలకు రైలు మార్గం కష్టం.. వాయు మార్గం ఆగమ శాస్త్రం ప్రకారం విరుద్ధం..  అందుకే రోప్ వే ను తెరపైకి తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్ర పర్యాటక సంస్థ 150 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ను పూర్తి చేసేదుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు అన్ని వచ్చేసాయి. ఇక చివరగా టీటీడీ పాలకమండలి..  శ్రీవారి ఆలయ ఆగమ సలహా మండలిదే తుది నిర్ణయం.

టీటీడీ బోర్డులో రోప్ వే పై తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. అలిపిరి నుంచి రోప్ వేను  నిర్మించాలని పాలకమండలిలో అజెండా ప్రవేశపెట్టారు.  రోప్ వే  ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించారట. తరువాత రోప్ వే పై నిర్ణయాన్ని పాలకమండలి ఆగమ సలహా మండలికి అప్పజెప్పింది. అప్పటి ఆగమ సలహా మండలి సభ్యులు  రోప్ వే తీవ్రంగా వ్యతిరేకించాయి.

తిరుమల పుణ్యక్షేత్రమని.. పర్యాటక ప్రాంతం కాదని స్పష్టం చేసాయి. వివిధ వాణిజ్య వాహనాలను భక్తుల అవసరాల కోసమే తిరుమలకు అముమతిస్తున్నామని..  లేదంటే వాణిజ్య వాహనాలకు తిరుమలలో అనుమతి నిషేధం అని ఆగమ సలహా మండలి తీర్మానం చేసింది. ఇక రోప్ వే  ప్రాజెక్ట్ తిరుమలలో చేపట్టరాదని స్పష్టం చేసింది. దింతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

కాలక్రమేణా భారీగా వర్షాలు కురవడంతో రెండవ ఘాట్ రోడ్డు పూర్తిగా దెబ్బతినడం ప్రారంభం అయింది. 2015లో కురిసిన వర్షాలకు భారీగా రెండో ఘాట్ రోడ్డు ధ్వంసం అయ్యింది. ఆ దారి భవిష్యత్‌లో మరింత దుస్థితికి చేరొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యామ్నాయ దిశగా ఆలోచన చేసింది. ఇందులో భాగంగా రోప్‌వే ఏర్పాటుపై కూడా మరో మరోమారు చర్చసాగింది.

అప్పట్లో  క్లిష్టపరిస్థితుల దృష్ట్యా ఇలాంటివి తప్పు కాదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. తిరుమల ఆలయంతోపాటు శేషాచల పర్వత శ్రేణుల్లో విమానయానం నిషేధించాలన్న డిమాండ్ ఉన్న తరుణంలో మార్చి 20, 2014న ఆలయానికి కూతవేటు దూరంలోని కాకులకొండ అడవిలో  కార్చిచ్చు రేగడం, ఆపరేషన్ శేషాచలం పేరుతో వాయుసేన హెలికాప్టర్‌తో నీళ్లు చల్లి మంటలను అదుపు చే సిన సందర్భాన్ని అధికారులు.. నిపుణులు గుర్తు చేస్తున్నారు.

విపత్తుల నష్టాన్ని నివారించేందుకు ఇటువంటికి చేపడుతున్నప్పుడు భక్తుల క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని రోప్‌వే నిర్మించడంలో తప్పులేదని అప్పట్లో అధికారుల వాదన.. 2015లోనే  ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాలకు రోప్‌వేలు ఉన్నాయని, వాటివల్ల భక్తులు క్లిష్ట పరిస్థితుల్లోకూడా కొండపైకి వెళుతున్నారని చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం  హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయానికి రోప్‌వే ద్వారా ఎక్కువ మంది భక్తులు సురక్షితంగా వెళుతున్నారని గుర్తు చేస్తున్నారు.

తిరుమలకు రోప్ వే ఉంటేనే మంచిది అని కొందరి భావన. తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అలాగే దైవ దర్శనానికి విచ్చేసే యాత్రికులకు మరచిపోలేని అనుభూతి కల్పించేందుకు పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద  "రోప్ వే" ఏర్పాటు చేయాలనీ డిసెంబర్ నెలలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రకాష్ గౌర్ తో భేటి అయ్యారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.

దేశవ్యాప్తంగా 10 రోప్‌వే ప్రాజెక్టుల కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం చేపట్టాలని అందులో భాగంగా తిరుపతిలో రోప్ వే ప్రాజెక్ట్ సాద్యాసాధ్యాలపై నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అధ్యయనం చేసేందుకు ఆదేశించారని సమాచారం. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా పర్వతమాల పరియోజన కింద రోప్‌వే ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాచే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు