హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unique Art: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!

Unique Art: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!

చెక్క శిల్పాలు తయారు చేస్తున్న మాధవవనం గ్రామస్తులు

చెక్క శిల్పాలు తయారు చేస్తున్న మాధవవనం గ్రామస్తులు

Tirupati: కళల్లో శిల్ప కళ ఎంతో గొప్పది. జక్కన చెక్కిన శిల్పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రస్తుతం నేటి సమాజంలో కుల వృత్తులు వీడి ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నారు. అందువల్లే కొన్ని కళలు కథల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. అలాంటి అంతరించి పోతున్న కళల జాబితాలో కలప శిల్ప కళ చేరిపోతోంది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

పూర్వీకులు మనకు ఎన్నో కళలను, నైపుణ్యాలను వారసత్వంగా ఇచ్చివెళ్లారు. ఇప్పటికే కొన్ని అరుదైన కళలు దాదాపు అంతరించిపోయాయి. ఆధునిక సాంకేతికత, స్మార్ట్ యుగం నడుస్తున్నా ఇంకా కొన్ని కళలు సజీవంగా ఉన్నాయి. టెక్నాలజీ సాయంతో అద్భుతమైన కళాఖండాలు రూపొందించినా.. చేతితో చేసిన వాటికి మరింత అందం ఉంటుంది. అలాంటి కళల్లో శిల్ప కళ ఎంతో గొప్పది. జక్కన చెక్కిన శిల్పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రస్తుతం నేటి సమాజంలో కుల వృత్తులు వీడి ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నారు. అందువల్లే కొన్ని కళలు కథల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. అలాంటి అంతరించి పోతున్న కళల జాబితాలో కలప శిల్ప తయారీ కళ చేరిపోతోంది. దశబ్దాల కాలం నుంచి అంతరించిపోతున్న ఆ కళను కాపాడేందుకు ఒక్క గ్రామం ఎంతగానో కృషి చేస్తోంది. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉంది..? వారి చేత్తో సృష్టిస్తున్న కళాఖండాలకు ఎందుకు అంత డిమాండ్..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి 10కిలోమీటర్ల దూరంలో ఉంది మాధవమాల గ్రామం. చిన్న గ్రామమే కావచ్చు కానీ ఎంతో పెద్ద బాధ్యతను మోస్తూ కళాకారుల జీవితనికే ఆదర్శంగా నిలుస్తూవస్తోంది. కొన్ని వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్న ఈ గ్రామంలో కళాపోషకులే ఎక్కువ. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉలిని చేతపట్టి అందమైన చెక్క శిల్పాలను తయారు చేసే వారే. నిర్జీవంగా ఉన్న కలపను తమ అబ్దుతమైన చేతులతో జీవం పోసి చేతులెత్తి నమస్కరించేలా చేస్తున్నారు.

ఇది చదవండి: ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.., భక్తుల తాకిడే కారణం.. పూర్తి వివరాలివే..!



పూర్వీకులు తమకిచ్చిన ఆస్థులుగా భావించి చేతి వృత్తులు చేస్తున్న ఈ కళాకారులకు ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక వీరి కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మాధవమాల గ్రామంలో నివసించే 85 శాతం మంది కలపలతో వివిధ అకృతులను తీర్చి దిద్దుతూ జీవనం సాగిస్తున్న వారే. ఎంబీఏ చదివినా ఖాళీగా ఉన్న సమయంలో ఉలిని చేతపట్టి కళాకృతులను తయారు చేస్తుంటారు. వీరు సుందగరంగా తీర్చిదిద్దే దేవతమూర్తుల విగ్రహాలు., ఇంటి ద్వారాలకు ఏర్పాటు చేసే దాలబంధరాలు, పక్షులు, జంతువుల బొమ్మలు తయారు చేస్తారు. వీరు తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వ ఎంపోరియాలకు తరలిస్తూ ఉంటారు. చదువుతో పాటుగా చేతివృత్తిని నేర్చుకుంటున్నారు.

ఇది చదవండి: శ్రీవారి వివాహం ఎలా జరిగిందో తెలుసా..? పద్మావతి పరిణయోత్సవాల విశేషాలివే..!


తరతరాల నుండి వస్తున్న చేతివృత్తిని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని, తమ పూర్వీకుల చేతి నైపుణ్యం జాతీయ స్ధాయిలో తెలియపరిచేందుకు కృషి చేస్తున్నట్లు వారు అంటున్నారు. తమిళనాడు రాష్ట్రం, పెరియపాళ్యం నుండి వలస వచ్చిన తమ పూర్వీకులు అప్పట్లో వేళ్లు బొమ్మలు తయారు చేసే వారని, ఆ తరువాత స్ధపత కొలత ఆధారంగా బొమ్మలు తయారు చేసే వారని అంటున్నారు. తమ పూర్వీకుల కళానైపుణ్యంతో మార్పు వచ్చిందని, ఆనాటి నుండి నేటి వరకూ తమ గ్రామ ప్రజలందరూ చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని చెబుతున్నారు.

ఇది చదవండి: అక్కడ ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే..! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..


ఈ అద్భుత కళా నైపుణ్యం తమతోనే అంతరించిపోకుండా చదువుకుంటున్న తమ పిల్లలకు ఈ కళను నేర్పిస్తున్నామని, ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో కొత్త కొత్త యంత్రాలు రావడంతో కొంత వరకూ తమకు ఆధరణ తగ్గిందని, కానీ చాలా మంది వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడి వచ్చి ఉపాధి కల్పిస్తుంటారని అంటున్నారు. రేయింబవళ్ళు కష్టపడి కలపలకు జీవం పోస్తే కొందరు దళారుల వల్ల తాము అధికంగా నష్ట పోతున్నాంమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ చేతి వృత్తిపై దృష్టి సారించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tirupati

ఉత్తమ కథలు