Home /News /andhra-pradesh /

TIRUPATI A VILLAGE IN CHITTOOR DISTRICT CREATING WONDERS WITH CLAY ARTS AS THEY URGES FOR MARKETING FACILITIES FULL DETAILS HERE PRN TPT

Clay Art: వీళ్లవి చేతులా..! మంత్రదండాలా..! మట్టితో మాణిక్యాలు సృష్టిస్తున్నారు.. ఆ కళకు ఫిదా అవ్వాల్సిందే..!

గ్రామస్తులు తయారు చేసిన కళాఖండాలు

గ్రామస్తులు తయారు చేసిన కళాఖండాలు

Clay Art: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజం.. పూర్వీకుల ఆచారాలు, అలవాట్లను మరచి పాశ్చాత్య సంస్మృతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మట్టితో మణిక్యలు రూపొందించే కళ అంతరించి పోకూడదనే... ఉద్దేశంతో ఆ గ్రామమంతా మన్నుతో అద్భుతాలు సృష్టిస్తోంది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  ఆధునిక సమాజంలో రోజురోజుకు కళాకారులు, వారిచేత కళాఖండాలు కనుమరుగు అవుతూ వస్తున్నాయి. ఎన్నో కళలు నేటి సమాజంలో కలగానే మిగిలిపోతున్న సందర్భాలు ఉన్నాయి. యాంత్రిక జీవన విధానం., అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజం.. పూర్వీకుల ఆచారాలు, అలవాట్లను మరచి పాశ్చాత్య సంస్మృతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మట్టితో మణిక్యలు రూపొందించే కళ అంతరించి పోకూడదనే... ఉద్దేశంతో ఆ గ్రామమంతా మన్నుతో అద్భుతాలు సృష్టిస్తోంది. మట్టి పాత్రల కోసం ప్రారంభమైన పాత్రల తయారీ.. సుమారు మూడు దశాబ్దాలకు ముందు వివిధ కళాకృతకు జీవంపోసే ప్రక్రియ క్రమంగా విస్తరిస్తోంది. కళాకారులు వారి చేతులనే మంత్రదండాలువలే మట్టితో అద్భుతమైన రూపు తెస్తున్నారు. అలా రూపుదిద్దుకున్న బొమ్మలే ఓ పల్లెకు జాతీయ స్థాయితో పాటు పేరు ప్రఖ్యాతులతో పాటుగా సౌందర్యాన్ని తెచ్చి పెట్టాయి. ఆ ఊరే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు మండలంలోని గంటావురు.

  టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా., దేశ విదేశాల స్థాయిలో ఖ్యాతి పొందింది గంటావురు. ఇక్కడ చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అబ్దుతమే. హై వే లోను.., గ్రామంలోని ప్రతి ఇంటి వద్దను టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనవులతో బావాలు పంచుకునట్లు అనిపిస్తుంటాయి. ఈ టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసే ప్రాంతంలో వివిధ కళాకృతులను సృష్టించడానికి జీవం పోసాడు ఓ అధ్యాపకుడు.

  ఇది చదవండి: వైజాగ్ వాసులకు శుభవార్త.. బీచ్ కి వెళ్తే ఆహ్లాదం, ఆరోగ్యం


  1983లో రిషి వ్యాలీ స్కూల్‌ టీచర్‌ అయిన విక్రమ్‌ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ పొందుతోంది. 50కి పైగా కుటుంబాలు టెర్రకోట బొమ్మలను జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోసితున్నారు. ఇందులో వందల సంఖ్యలో ఉన్న ప్రజలంతా హస్త కళాకారులున్నారు. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రం ఉంది.

  ఇది చదవండి: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!


  హైవే రోడ్డుపక్కనే ఈ ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా ఈ కళకు కలిసొచ్చింది. టెర్రకోట సౌందర్యం ఇక్కడి కళాకారుల ఖ్యాతిని నలుదిశలా చాటిచెబుతోంది. వీరు తయారు చేయడమే కాకుండా కలకత్తా, గోరఖ్‌పూర్, ఢిల్లీ, అహమ్మదాబాద్, లక్నో, చెల్లి గూడ తదితర ప్రాంతాల నుంచి కూడా నాణ్యమైన బొమ్మలను తెప్పించి, వాటికి అదనపు అలంకరణలు జోడించి, తుది మెరుగులు దిద్ది, వ్రికయిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన కుముద్‌బెన్‌ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్‌ లాంటి వారు ఈ ఊరిని సందర్శించారు. కళాకారులను మెచ్చుకున్నారు.

  ఇది చదవండి: అక్కడ ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే..! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..


  కళాకారుల చేతులు ఎన్నో అద్భుతాలు మరెన్నో కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేలా మట్టి శిల్పాలను తయారు చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు, శ్రీవేంకటేశ్వరుడు, వినాయకుడు, ఇతర దేవత మూర్తులు, వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. వీళ్లంతా కంటేవారిపల్లెలో నేర్చుకున్నవారే. ట్రెండ్‌ను పసిగట్టి వ్యాపారం చేస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళుతున్నారు. మరో వైపు సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ మట్టిబొమ్మలు నిలుస్తున్నాయి. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలు ఉంటే... విదేశాల్లో మాత్రం వీటికి ఉన్న డిమాండ్ ఆధారంగా 200వందలకు పైగా పలుకుతోందని తయారీ దారులు చెప్తున్నారు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు