• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TIRUPATI A VILLAGE IN ANANTHAPURAM DISTRICT RESTRICTED CORONA VIRUS AS NO SINGLE POSITIVE CASE TILL NOW FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: ఆ ఊళ్లో కరోనాకు నో ఎంట్రీ... అది ఎలా సాధ్యమైందంటే…?

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం బయటకెళ్తే చాలు కరోనా చుట్టేస్తోంది. అలాంటికి ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

    పచ్చని చెట్లు. హాయిగా వీచే గాలులతో మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి పల్లెలు. చుట్టూ పొలాలు, వాటిని సాగుచేసుకునే రైతన్నల కుటుంబాలతో కళకళలాడుతుంటాయి. పొరుగు వారిని మామ, అత్త, బాబాయ్, పిన్ని ఇలా ఆప్యాయంగా పలిచే పిలుపులకు వేదిక. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని మహానగరాల నుంచి చిన్న చిన్న నగరాల వరకు, పెద్ద పంచాయితీల నుంచి చిన్న వరకు ఎక్కడ చుసిన మహమ్మారి ప్రజలను పీడించడం మాత్రం సెకండ్ వేవ్ లో సర్వ సాధారణం అయిపోయింది. కరోనా రాకుండా కొన్ని గ్రామాలూ రోడ్డుని త్రవేసిన, మూళ్ళ కంపలు వేసిన కరోనా ఎంట్రీ మాత్రం ఆగలేదు. కానీ ఆ పల్లెలోని కట్టుబాట్లే పల్లె వాసులకు శ్రీరామా రక్షగా మారింది. పెద్దలు చెప్పిన మాటను జవదాటని ఆ పల్లె వాసులు కరోనా రహిత గ్రామంగా తీర్చి దిద్దుకొని అనంత జిల్లాకే ఆదర్శనంగా మారుతున్నారు. 160 ఇళ్లతో....2 వేల మంది నివసించే పల్లెటూరు అది.

    కరోనా మొదటి వేవ్ లో మొదటి కేసు నమోదు అయినా నాటి నుంచి నేటి వరకు ఒక్క కరోనా కేసు కూడా ఆ గ్రామంలో నమోదు కాలేదు అంటే నిజంగా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇంతకీ అనంత జిల్లాలో ఎక్కడ ఉంది ఆ గ్రామం, వారి పెట్టుకున్న కట్టుబాట్లు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

    అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మల హళ్ మండలంలోని గౌనూరు చిన్న అనే చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న కుటుంబాలు అన్ని వ్యవసాయ ఆధారితంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. రెండు వేల మంది జనాభా కలిగి ఉన్న ఆ గ్రామం ఇప్పటికి కరోనా రహిత ప్రాంతంగా పేరొందింది. అసలు కరోనా రాకుండా ఈ ఊరి పెద్దలు పెట్టిన కట్టుబాట్లు చిన్నారుల నుంచి ముసలి వాళ్ళ వరకు అధికమించక పోవడమే ముఖ్య కారణం. ఒక్క కరోనా విషయంలోనే కాదు ఆ పల్లె ప్రతి సమస్యలలోను ఇదే పద్ధతి అవలంభిస్తుండటంతో కరోనాను సునాయాసంగా పల్లె పొలిమేరల్లోనే సమాధి చేసారు. ఏ సమస్య వచ్చిన ఆ గ్రామంలో పీర్ల చావిడి వద్ద సమావేశం అవుతారు. ఈ ఆచారం ఇప్పటిది కాదని అనాదిగా వస్తోన్న సంప్రదాయంగా ఊరి పెద్దలు చెప్తున్నారు. గ్రామా ప్రజల అంగీకారంతో ఇక్కడే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆచరించాల్సిందే. కరోనా కట్టడికి అదే విధాన్ని అవలంభించారు.

    కరోనా గ్రామంలోకి రాకుండా ఉండేలా ఆ పీర్ల చావిడి వద్దే నిర్ణయం తీసుకోని అమలు చేశారు. నిర్ణయంలో భాగంగా ఆ ఊరిలో గ్రామా దేవతకు అన్నాభిషేకం నిర్వహించి ఊరి పొలిమేరలో పెరుగన్నాని చెల్లించారు. గ్రామంలో ఉంటె మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అత్యవసర సమయంలో బయటకు వెళ్లే వాళ్ళు మాత్రం కచ్చితంగా కరోనా నియమాలు పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా శుభ కార్యం జరిగిన రోజు అందరూ హాజరవుతారు. కానీ బయట వారికీ నో ఎంట్రీ. మరి ముఖ్యం అనుకుంటే కచ్చితంగా వారు మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆహార ధాన్యాలు బయట నుంచి వచ్చిన వాటిని పూర్తి శుభ్రం చేసి ఊరిలోకి తరలిస్తున్నారు. పెద్దల మాట పెరుగన్నం మూటల భావించే ఈ గ్రామా వాసులు కరోనాని చాలసులభమైన మార్గంలో కట్టడి చేశారనే చెప్పుకోవాలి.
    Published by:Purna Chandra
    First published: