హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Liquor Baba: ఫుల్ బాటిల్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా...

Liquor Baba: ఫుల్ బాటిల్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా...

తమిళనాడులో లిక్కర్ బాబా

తమిళనాడులో లిక్కర్ బాబా

Liquor Baba: మన దేశంలో డాక్టర్ల కంటే బాబాలకే క్రేజ్ ఎక్కువ... మెడిసన్ కంటే మ్యాజిక్ లకే క్రేజ్ ఎక్కువ. మూఢనమ్మకాలను నమ్మినంత ఈజీగా సైన్స్ ని నమ్మరు. ప్రతి ఒక్కరికీ ఫ్యూచర్ గురించే ఆలోచన.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

Full Bottle Baba: మన దేశంలో డాక్టర్ల కంటే బాబాలకే క్రేజ్ ఎక్కువ... మెడిసన్ కంటే మ్యాజిక్ లకే క్రేజ్ ఎక్కువ. మూఢనమ్మకాలను (Superstitions)  నమ్మినంత ఈజీగా సైన్స్ ని నమ్మరు. ప్రతి ఒక్కరికీ ఫ్యూచర్ గురించే ఆలోచన. జీవితంలో రేపు ఏం జరగబోతోందనే ఆత్రుత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీంతో జాతకాలు చెప్తామంటూ చాలా మంది జనాల్ని మోసం చేస్తుంటారు. అలాగే అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా బాబాల వద్దకు పరుగులు పెడుతుంటారు. ఐతే కొందరు బాబాలు చిత్ర విచిత్రమైన పద్ధతులతో వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తన్నులతో దోషాలు పొగడతామంటే.. ముద్దులతో జాతకాలు చెప్తామంటూ మోసం చేస్తుంటారు. ఐతే ఓ బాబా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో వ్యవహారం నడిపిస్తున్నాడు. ఆశ్రమాన్ని ఏకంగా లిక్కర్ షాప్ గా మార్చేశాడు. ఆ బాబాకు ఫుల్ బాటిల్ ఇస్తే చాలు మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.

వివరాల్లోకి వెళితే.... తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూర్లోని టోల్ ప్లాజా సమీపంలోని నెమలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన మణి గత పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఆ ఆయలం వద్ద పనిచేస్తూ తొలుత రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదించేవాడు. ఐతే కొన్నాళ్ల క్రితం ఆలయం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మణిబాబా అవతారమెత్తాడు. ఫ్యూచర్ చెప్తానంటూ ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టాడు.

ఇది చదవండి: బయటపడ్డ డాక్టర్ గారి ఎఫైర్... రోడ్డుమీదే రచ్చరచ్చ.. వీడియో వైరల్...


ఫుల్ బాటిల్ తెస్తేనే..!

సాధారణంగా బాబాలకు పండ్లు, పూలు, డబ్బులు, కొన్ని రకాల ఆహార పదార్ధాలు భక్తులు సమర్పిస్తుంటారు. కానీ ఈ మణి బాబా రూటే సపరేటు. కిక్ ఎక్కితే తప్ప మనోడి భవిష్యవాణి పలకదు. ఫుల్ బాటిల్ ముందుపెడితే చాలు.. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో పెట్టేస్తాడు. చుక్కనోట్లో పడితే జరిగింది.. జరుగుతుంది.. జరగబోయేది.. మొత్తం చెప్పేస్తాడు. బాబా కదా..! ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తాడు.. అంతేకాదు అక్కడుకు వచ్చిన కొందరు భక్తులు బాబా ఇచ్చిన మందును తీర్థంలాగా స్వీకరిస్తారు.


ఇది చదవండి: వీడిని పశువులతో పోల్చినా తప్పే..! కన్నకూతురిపైనే అఘాయిత్యం..


మందు కొడుతున్నాడు... భక్తులకు పోస్తున్నాడు. ఇతను బాబా ఏంటని అనుకుంటున్నారు. ఈ మణి బాబా దగ్గరకు భక్తులు క్యూ కడుతున్నారు. మందు మత్తులో నిజంగానే ఫ్యూచర్ చెబుతున్నాడని నమ్మి ఆతని ఆశ్రమానికి పరుగులు పెడుతున్నారు. బాబా దగ్గరకు పురుషులతో పాటు మహిళలు కూడా ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నారట. అంతేకాదు అతడి ఆశ్రమ వద్ద కార్లు బారులు తీరుతున్నాయి. మరి ఈ బాబా చెప్పే జ్యోతిష్యంలో ఎంత నిజముందోకానీ.. అశ్రమంలో మాత్రం లిక్కర్ ఏరులై పారుతోంది. ఈయన ఎఫెక్ట్ తో అక్కడ లిక్కర్ బిజినెస్ మూడు పువ్వులు.. ముప్పై కాయలుగా సాగుతోందట. ప్రజలు నమ్మినంత కాలం ఇలాంటి బాబాలు సెలెబ్రెటీలవుతారని కొందరు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tamil nadu, Tirupati

ఉత్తమ కథలు