Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati Woman: ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత..

Tirupati Woman: ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత..

శరణ్య (ఫైల్)

శరణ్య (ఫైల్)

ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కు వెళ్తే చాలు.. ఎంత అందవిహీనంగా ఉన్నా.. అందంగా మార్చేస్తారు. ముసలోళ్లను సైతం కుర్రోళ్ల మాదిరిగా చూపెడతారు. మేకప్ వేసుకున్నప్పుడు చూసిన వారిని.. మేకప్ తీసేస్తే గుర్తుపట్టడం కష్టం. అలా మేకప్ మాయతో ఆ ఆంటీ.. కుర్రపిల్లలా మారిపోయింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కు వెళ్తే చాలు.. ఎంత అందవిహీనంగా ఉన్నా.. అందంగా మార్చేస్తారు. ముసలోళ్లను సైతం కుర్రోళ్ల మాదిరిగా చూపెడతారు. మేకప్ వేసుకున్నప్పుడు చూసిన వారిని.. మేకప్ తీసేస్తే గుర్తుపట్టడం కష్టం. అలా మేకప్ మాయతో ఆ ఆంటీ.. కుర్రపిల్లలా మారిపోయింది. ఓ యువకుడ్ని దారుణంగా ముంచేసింది. వివరాల్లోకి వెళ్ళితే.. తమిళనాడు (Tamil nadu) రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా, పుదుప్పేటలో ఇంద్రాణి (65) కుమారుడుతో కలిసి నివాసం ఉంటోంది. ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అప్పటికే అతగాడికి పెళ్లై విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో గత 6 ఏళ్లుగా కొడుక్కి తగిన వధువు కోసం ఇంద్రాణి వెతుకుతోంది. 2021లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District), పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ ఓ పెళ్లి బ్రోకర్‌ ద్వారా పరిచయమైంది.

తనను చూసుకోవడానికి వస్తున్నారన్న సమాచారం తెలియడంతో 54 ఏళ్ల శరణ్య వెంటనే బ్యూటీపార్లకు వెళ్లి మేకప్ వేయించుకోని యువతిలా తయారైంది. ఆతర్వాత 35 ఏళ్లతో వరుడి ఎదుట పెళ్లి చూపులకు కూర్చుంది. ఆమె అందానికి ఫిదా అయిన వరుడు కుటుంబీకులు వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అంతేకాదు పెళ్లికూతురికి 25 సవర్ల బంగారాన్ని ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు.

ఇది చదవండి: భర్తకు తెలియకుండా అస్తిని అమ్మేసిన భార్య.. అసలు నిజం తెలిసి భర్త ఏం చేశాడంటే..!


పెళ్లైన కొద్దిరోజుల తర్వాత శరణ్య భర్తకు, అత్తకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. భర్త సంపాదనంతా తనచేతిలోనే పెట్టాలని, బీరువా తాళాలు ఇవ్వాలంటూ గొడవపడుతుండేదు. అంతేకాదు భర్త, అత్త పేరుమీదున్న ఆస్తులను తనపేరు మీద రాయాలని డిమాండ్ చేస్తుండేది. ఈ క్రమంలో అత్త ఇంద్రాణిని ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఐతే వేధింపులకు అడ్డుకట్టవేయాలని భావించిన భర్త.. ఆస్తి నీ పేరు మీద రాసేందుకు ఆధార్ కార్డ్ ఇవ్వాలని కోరాడు. దీంతో వెంటనే శరణ్య తన ఆధార్ కార్డును భర్తకు ఇచ్చింది. అందులే కేరాఫ్ రవి అని రాసి ఉండటంతో ఇంద్రాణికి, ఆమె కుమారుడికి డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధార్ కార్డు, డాక్యుమెంట్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు షఆకింగ్ నిజాలు తెలిశాయి.

ఇది చదవండి: ప్రేమ వ్యవహారం లేదు.. పని ఒత్తిడి లేదు.. యువతి ఆత్మహత్యకు కారణం తెలిసి షాకైన పోలీసులు..


పుత్తూరుకు చెందిన శరణ్య అలియాస్ సుకున్య (సంధ్య) కి అదే ప్రాంతానికి చెందిన రవితో ఇంతకు ముందే వివాహం జరిగింది. వీళ్లిద్దరికీ ఇద్దరు కుమార్తెలున్నారు. వాళ్లకి కూడా పెళ్లయింది. ఐతే భర్త రవితో విభేదాల కారణంగా విడిపోయిన శరణ్య.. ప్రస్తుతం తల్లితో కలిసి జీవిస్తోంది. ఐతే సంపాదన లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని భావించి.. కొంతమంది పెళ్లిళ్ల బ్రోకర్లతో పరిచయం పెంచుకొని విడాకులు తీసుకున్న యువకులను మోసం చేయడం ప్రారంభించింది.

గతంలో ఈమె సుబ్రమణి అనే వ్యక్తికి తనపేరు సంధ్యగా పరిచయం చేసుకొని అతడితో దాదాపు 11ఏళ్లపాటు కాపురం చేసింది. ఆ తర్వాత కరోనా సమయంలో తల్లిని చూసేందుకు వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. ఈ క్రమంలో ఇంద్రాణి కుమారుడి విషయం తెలుసుకొని.. తనకింకా పెళ్లి కాలేదని నమ్మించి ఆస్తి కాజేయాలని స్కెచ్ వేసింది. వెంటనే ఇంద్రాణితో తన పేరు శరణ్యగా పరిచయం చేసుకుంది. అతడ్ని పెళ్లి చేసుకొని అడ్డంగా ముంచేసింది. అంతేకాదు మొదటి భర్త రవిపై కేసు పెట్టి అతడి నుంచి రూ.10లక్షలు కాజేసింది.

First published:

Tags: Andhra Pradesh, Cheating, Tirupati

ఉత్తమ కథలు