ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి మండలంలోని పుంగనూరు రోడ్డువద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. అతివేగంగా కారుణంగా అదుపతప్పి కారు కల్వర్టును ఢీ కొట్టి బోల్తాపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డిపల్లి వాసులుగా గుర్తించారు. మృతుల్లో భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు గంగిరెడ్డి, మాధవీలత, కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. అతివేగంతో తప్పిన కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో బోల్తాపడింది. మృతులు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదిలా ఉంటే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు హైవేవై ఐతేపల్లి వద్ద ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హేవేపై వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని డీ కొట్టింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నుంచి తిరుపతి వచ్చిన శ్రీవారి భక్తులు.. దర్శనానికి టైమ్ ఉండటంతో మరో గుడిని దర్శించుకునేందుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.
గత ఏడాది ఇదే ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబంలోని ఆరుగురు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబంలో చిన్నపాప తప్ప అందరూ మరణించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టింది. ఆ విషాదం మరవక ముందే అదే ప్రాంతంలో మరో కుటుంబం బలవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాదిలో చిత్తూరు-చెన్నై హైవేలో దాదాపు 700 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గురువారం కృష్ణాజిల్లా (Krishna District) లో ఘోర ప్రమాదం జరిగింది. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందిన పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే పెళ్లికి ఆటోలో వెళ్లగా చల్లపల్లి వద్ద కాశానగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఘటనలో ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందారు. పలువురుకి తీవ్రగాయాలవగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Road accident