Cheating: తడిగుడ్డతో గొంతుకోయడం అంటే ఇదేనేమో..! ఇది మామూలు స్కెచ్ కాదు..

ప్రతీకాత్మకచిత్రం

తమను నమ్మిన వారిని మోసం చేయడం చాలా ఈజీ. ముగ్గురు వ్యక్తులు స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని సినిమా స్టైల్లో మోసం చేశారు.

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    వజ్రం. ఇది సామాన్యునికి దొరకని అరుదైన ఆభరణం. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వజ్రాలు మార్కెట్లో లభిస్తుంది. సంపన్నులు, పెద్ద వ్యాపార వేతల దగ్గర మాత్రమే అత్యంత ఖరీదైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉంటాయి. అదే సమయంలో తమ వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయని మోసం చేసే ముఠాలు కూడా ఉన్నాయి. బ్లఫ్ మాస్టర్ సినిమాలో హీరో వివిధ రకాలుగా వ్యాపారులను మోసం చేస్తాడు. పుడు పాము దగ్గర నుంచి రైస్ పుల్లింగ్ వరకు వివిధ గారడీలు చేసి అవతల వ్యక్తులను బోల్తా కొట్టించి.. తనవద్ద ఉన్న నకిలీ వస్తువులను భారీ ధరకు విక్రయిస్తాడు. తీవ్ర మోసపోయాం అని తెలిసేలోపే డబ్బులు మొత్తం స్వాహా అవుతాయి. ఇలా నకిలీ వజ్రాన్నీ చూపించి ఓ వ్యాపారి వద్ద 58.60 లక్షలు కాజేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తితో ముందస్తుగా ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని దారణంగా మోసం చేశారు.

    వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా, కాణిపాకం గ్రామానికి చెందిన డి.భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె మండలం సరకల్లుకుచెందిన బొజ్జయ్యతో స్నేహం ఏర్పడింది. వీరి స్నేహం సన్నిహితంగా మారింది. వారు ఏమి చెప్పిన పూర్తిగా నమ్మేసేవాడు భాస్కర్ రావు. దీనినే ఆసరాగా చేసుకుని దామోదరం, బొజ్జయ్య..., భాస్కరరావుకు నకిలీ వజ్రాన్ని విక్రయించే పన్నాగం పన్నారు. ఈ క్రమంలో చిత్తూరులోని కట్టమంచికి చెందిన శ్రీనివాసులతో కలిసి ఓ నకిలీ వజ్రాన్ని భాస్కరరావు ముందు ఉంచారు. కోటి యాభై లక్షలు విలువ చేసే వజ్రమని నమ్మబలికారు. వాళ్లు చెప్పిన కట్టుకథను పూర్తిగా నమ్మేసిన భాస్కర్ రావు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలుమార్లు మొత్తం రూ.58.60 లక్షలు అప్పు ఇచ్చాడు.

    ఇది చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుదామనుకున్నారు.. కానీ అడ్డంగా దొరికిపోయారు..

    వారు కుదువపెట్టిన వజ్రంపై ముందుగా అనుమానం రాలేదు. అంతేకాదు వారు వజ్రానికి సర్టిఫికెట్ కూడా చూపించారు. దీంతో అనుమానం రాలేదు. కానీ కొంతకాలంగా దామోదరం, బొజ్జాయలు భాస్కర్ రావుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సరిగా మాట్లాడకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భాస్కర్ రావు వజ్రాన్ని పరీక్ష చేయించారు. అది నకిలీ అని తేలడంతో కంగుతిన్నాడు. వారికి వెంటనే కాల్ చేసి అడుగగా ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వలేమంటూ ముఖం చాటేశారు.

    దీంతో భాస్కరరావు కాణిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన సూత్రధారి శ్రీనివాసులని గుర్తించారు. అతడి వద్ద కమిషన్ తీసుకుని దామోదరం, బొజ్జయ్య..భాస్కరరావు వద్ద నగదు ఇప్పించినట్లు తేల్చారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
    Published by:Purna Chandra
    First published: