Home /News /andhra-pradesh /

TIRUPATI 14 INJURED AS ARCH RIVALS FIGHTING FOR ASSETS IN TIRUPATI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati News: దాయాదుల మధ్య చిచ్చుపెట్టిన కుక్క.. రెచ్చిపోయి రచ్చచేసిన అన్నదమ్ములు

తిరుపతిలో తన్నుకున్న దాయాదులు

తిరుపతిలో తన్నుకున్న దాయాదులు

Fighting: కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే చినికి చినికి గాలివానలా మారి పెద్ద గొడవకు దారితీస్తాయి. అదే సమయంలో పాతకక్షలు మనుసులో పాతుకుపోయి ఉంటే మాత్రం సిల్లీ రీజన్స్ కే చంపుకునే వరకు వెళ్తుంటారు కొందరు. అంగుళం భూమి విషయంలోనే కత్తులు దూసుకునే ఈ రోజుల్లో ఆస్తి తగాదాల విషయంలో రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే చినికి చినికి గాలివానలా మారి పెద్ద గొడవకు దారితీస్తాయి. అదే సమయంలో పాతకక్షలు మనుసులో పాతుకుపోయి ఉంటే మాత్రం సిల్లీ రీజన్స్ కే చంపుకునే వరకు వెళ్తుంటారు కొందరు. అంగుళం భూమి విషయంలోనే కత్తులు దూసుకునే ఈ రోజుల్లో ఆస్తి తగాదాల విషయంలో రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. దాయాదుల మధ్య మొదలైన ఆస్తి తగాదా.. వీధికుక్కల కారణంగా పీక్స్ కు చేరింది. ఇంకేముంది రక్తమొచ్చేటట్లు కొట్టుకున్నారు. ఆత్మీయంగా ఉండాల్సిన వాళ్లు కాస్తా కాళ్లు చేతులు విరగ్గొట్టుకొని ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) కేవీబీపురం మండలం అరిగేరి చెరువు గ్రామం ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.

    ఈ గ్రామానికి చెందిన శంకరయ్యకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఈశ్వరమ్మ మరణించడంతో బుజమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇక రెండవ భార్యతో సంసారం సాగించిన శంకరయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. ఐతే ఇద్దరు భార్యల పిల్లలకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆస్తి విషయంలో తగాదాలు ఆడుకున్నారు. ఈ క్రమంలో శంకరయ్య కొంతకాలంగా మొదటిభార్య పిల్లల వద్దే ఉంటున్నాడు. దీంతో ఆ ముగ్గురు పిల్లలు ఆస్తిపై తమకు పూర్తి హక్కులు కల్పించాలని కోరుతుండేవారు. . ఈ విషయమై రెండవ భార్య శంకరయ్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆస్తిలో సంగం వాటా తనకు ఇప్పించాలని పలుసార్లు శంకరయ్యను కోరోతోంది.

    ఇది చదవండి: తండ్రిలాంటివాడని నమ్మితే ఇలా చేస్తాడనుకోలేదు..


    ఇదిలా ఉంటే ఈనెల 17న శంకరయ్య మొదటిభార్య పిల్లలు వీధిలో కుక్కను తరుముతుండగా రెండో భార్య బంధువులు తారసపడటంతో గొడవ మొదలైంది. కుక్కను మాఇళ్లవైపు ఎందుకు తోలుతున్నారంటూ మాటా మాటా పెరిగి వాగ్వాదమాడుకున్నారు. అదికాస్తా ముదురి తన్నుకునేవరకు వెళ్లింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఒకే కుటుంబానికి చెందిన ఇరువర్గాలు కర్రలు, కత్తులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 14మందికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వీరిని శ్రీకాళహస్తి, తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

    ఇది చదవండి: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. రైలు పట్టాలపై పడుకున్న తండ్రి..


    ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కొట్లాటతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపు స్థానికులంతా హడలిపోయారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను విడదీయడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఆస్తుల పంచాయతీ.. వీధికుక్కల కారణంగా కొట్లాట వరకు వెళ్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు