Home /News /andhra-pradesh /

Andhra Pradesh: ఈ పాత్ర మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే.. కానీ అసలు కథ వేరే ఉంది..!

Andhra Pradesh: ఈ పాత్ర మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే.. కానీ అసలు కథ వేరే ఉంది..!

పోలీసులు స్వాధీనం చేసుకున్న రాగిపాత్ర

పోలీసులు స్వాధీనం చేసుకున్న రాగిపాత్ర

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా జనం బాబాలను, మ్యాజిక్ నే నమ్ముతారు. రాత్రికి రాత్రే అదృష్టం వరించి కోటీశ్వరులైపోవాలని భావిస్తుంటారు.

    టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా జనం బాబాలను, మ్యాజిక్ నే నమ్ముతారు. రాత్రికి రాత్రే అదృష్టం వరించి కోటీశ్వరులైపోవాలని భావిస్తుంటారు. అందుకే కష్టపడటం మానేసి క్షుద్రపూజలు, రైస్ పుల్లింగ్ అంటూ తిరుగుతుంటారు. ఓ పాత రాగిపాత్రకు రంగులుపూసి రైస్ పుల్లింగ్ పేరుతో మాయ చేస్తున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో ఛీటింగ్ చేస్తున్నారు. మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై–జంక్షన్‌ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి స్కెచ్ అంతా వివరించారు. చిత్తూరు, కడప, అనంతపురం, తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ కు చెందిన 13 మంది వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో రాగిపాత్రలను విక్రయించి దందా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కారు.

    వీరంతా రాగిపాత్రలకు రంగుపూసి దానిపై టార్చ్ లైట్ వేసి చూపించి అది మహిమగల పాత్ర అని.. పూజలుచేస్తే అక్షయపాత్రలా మారిపోతుందని బాగా డబ్బున్నవాళ్లను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం పెడుతున్నారు. ముఠా వ్యవహారంపై నిఘా ఉంచిన పోలీసులు వారిని పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

    ఇది చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు


    పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శాంతిలాల్‌(37), రామచంద్రాపురం మండలం చుట్టగుంట గ్రామానికి చెందిన జె.శ్రీనివాసులు(45), దుర్గసముద్రం ప్రాంతానికి చెందిన ఎన్‌.శివశంకరయ్య(48), మదనపల్లె రూరల్‌ మండలం బసినికొండకు చెందిన జి.శ్రీనివాసులు(35) వైఎస్‌ఆర్‌ జిల్లా చిప్పిడిరాళ్ల గ్రామానికి చెందిన కె.మధుసూదన్‌రెడ్డి(32), అనంతపురం జిల్లా బండార్లపల్లెకు చెందిన న్యాయవాది డి.చెన్నారెడ్డి(55), తాడిపత్రిలోని సుంకులమ్మ కాలనీకి చెందిన పి.నాగరాజు(40), నంద్యాల రోడ్డు సీపీఐ కాలనీకి చెందిన పి.చంద్రహాస్‌(21), ఎర్రంకలవారిపల్లెకు చెందిన బి.ప్రేమానందరెడ్డి(42) తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన డి.రాజేంద్రప్రసాద్‌(33), కూకుట్‌పల్లిలోని నీలాద్రీ టవర్స్‌కు చెందిన ఎస్‌.అశోక్‌రెడ్డి(42), కర్ణాటకలోని ఎలహంకకు చెందిన కె.ఎం.మునీష్‌(27), చిక్‌బళ్లాపూర్‌కు చెందిన వి.నాగరాజు(25) ఉన్నారు.

    ఇది చదవండి: షాపులో పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యజమాని... కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి..


    రైస్ పుల్లింగ్ వంటి మాటలు అన్ని మోసాలేనని.. ఇలాంటివి అసలు పనిచేయవని.. ప్రజలు ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో విజయనగరం జిల్లాలోనూ ఓ ఇత్తడి చెంబును మహిమాన్విత చెంబుగా నమ్మించి రూ.50 కోట్లకు బేరం పెట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cheating, Tirupati

    తదుపరి వార్తలు