Home /News /andhra-pradesh /

TIRUPATI 10 YEARS SON SPENT FOUR DAYS WITH MOTHER DEAD BODY HE TAUGHT THAT SHE WAS SLEEPING IN TIRUPATI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Sad News: పాపం పసివాడు.. తల్లి నిద్రపోతుందనుకున్నాడు.. కానీ నాలుగు రోజుల తర్వాత

శ్యామ్ కిషోర్, రాజ్యలక్ష్మి (ఫైల్)

శ్యామ్ కిషోర్, రాజ్యలక్ష్మి (ఫైల్)

Mother and Son: తల్లి నిద్రపోతుందనుకొని ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టలేక స్కూల్ కి వెళ్లిపోతున్నాడు. కానీ ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిందని గ్రహించలేకపోయాడు. నాలుగు రోజులు తల్లి శవంతోనే గడిపాడు.

    ఆ బాలుడికి తల్లితప్ప మరెవరూ లేరు. తండ్రి దూరం కావడంతో అమ్మలోనే నాన్నని, లోకాన్ని చూస్తున్నాడు. ఆమెకు కూడా కొడుకు తప్ప మరో లోకం లేదు. అందుకే పేగు బంధాన్ని వదులుకోలేక కష్టపడి వాడిని చదివిస్తోంది. ఐతే ఉన్నట్లుండి ఆ బాలుడి జీవితం చీకటిమయమైంది. తల్లి నిద్రపోతుందనుకొని ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టలేక స్కూల్ కి వెళ్లిపోతున్నాడు. కానీ ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిందని గ్రహించలేకపోయాడు. ఈ హృదయ విదారకమైన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) నగరంలో చోటు చేసుకుంది. విద్యానగర్ కాలనీలోని ఓ ఇంటి పెంట్ హౌస్ లో రాజ్యలక్ష్మి అనే మహిళ తన కొడుకు శ్యామ్ కిషోర్ తో కలిసి నివాసముంటోంది. భర్తతో విబేధాలు రావడంతో అతడ్ని నుంచి విడిపోయింది.

    ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ కొడుకుని చదివిస్తోంది. ప్రస్తుతం అతడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఐతే నాలుగు రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో కాసేపు పడుకుంటానని కొడుకుతో చెప్పింది. సరేనన్న కొడుకు రెడీ అయి స్కూల్ కి వెళ్లిపోయాడు. తిరిగొచ్చేసరికి తల్లి లేవకపోయేసరికి నిద్రపోతుందనుకున్నాడు. తల్లిని లేపే ప్రయత్నం చేసినా లేవకపోవడంతో నిద్రపోతుందని భావించాడు.

    ఇది చదవండి: ఆ ప్రాంతంలో మాయమవుతున్న గేదెలు.. తలపట్టుకుంటున్న రైతలు, పోలీసులు..


    అలా అమ్మను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాలుగు రోజులుగా తానే రెడీ అయి స్కూల్ కి వెళ్లిపోతున్నాడు. ఐతే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఆమె ఇంటికి వెళ్లి చూడగా రాజ్యలక్ష్మి చనిపోయింది. దీంతో స్థానికులు వార్డు సచివాలయ సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారమందించారు.

    ఇది చదవండి: ఏపీలో మిస్టరీ మరణాలు.. రెండు రోజుల్లో 15 మంది మృతి.. కారణం ఇదేనా..?


    దీనిపై ఆమె కుమారుడు శ్యామ్ కిషోర్ ను ప్రశ్నించగా.. తన తల్లికి నాలుగు రోజుల క్రితం వాంతులయ్యాయని.. కాసేపు పడుకుంటానని చెప్పిందని.. అమ్మను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తానే స్కూల్ కు వెళ్లిపోతున్నాని వివరించాడు. నాలుగు రోజులుగా వంట చేసుకొని తింటున్నట్లు తెలిపాడు. అప్పటివరకు అన్నీ తానే అయి పెంచిన తల్లి లేకపోయాసరికి శ్యామ్ కిషోర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఐతే ఆమె అనారోగ్యంతో మృతి చెందిందా.. లేక మరేదైనా కారణమా అనేది మాత్రం తెలియలేదు.

    ఇది చదవండి: సరదాగా బీచ్ కు వెళ్లిన ప్రేమజంట.. ప్రియుడ్ని కట్టేసి యువతిపై దారుణం..


    ఇంటి ఓనర్ మాత్రం ఆమెకు ఎవరితోనూ విబేధాలు లేవని.. ఎవరితోనూ ఎక్కువగా కలవదన్నారు. ఐతే తల్లి లేవలేకపోతున్న విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియకనే ఆమె కొడుకు మిన్నకుండిపోయి ఉండొచ్చని ఇంటి యజమాని చెప్పారు. దుర్వాసన రావడంతో రాజ్యలక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి చెప్పగా.. వచ్చి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆమె భర్త ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియదన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు