తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నేడు, రేపు ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని ప్రకటించారు. 2 రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత ఆదివారం నుండి యథావిధిగా ఆలయాన్ని తెరుస్తామని తెలిపారు. అంతకుముందు గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి... ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా రెగ్యూలర్ చెకప్‌కు వెళ్లారు. అయితే ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి సంచరించిన పాత హుజుర్ ఆఫీస్, పిహెచ్ స్టోర్‌ను కూడా రెండు రోజులు మూసివేసి శానిటైజ్ చేయనున్నారు. ఇక ఆయనను కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది.
Published by:Kishore Akkaladevi
First published:June 12, 2020, 13:33 IST