హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Garuda Varadhi: తృటిలో తప్పిన పెను ప్రమాదం... కూలిన గరుడ వారధి... పరుగులు పెట్టిన జనం

Garuda Varadhi: తృటిలో తప్పిన పెను ప్రమాదం... కూలిన గరుడ వారధి... పరుగులు పెట్టిన జనం

కూలిన గరుడవారధి ఫ్లై ఓవర్

కూలిన గరుడవారధి ఫ్లై ఓవర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో (Tirupathi) ఘోరప్రమాదం జరిగింది. టీటీడీ (TTD) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడ వారధి (Garuda Varadhi Flyover) పనుల్లో అపశృతి చోటు చేసుకుంది

  ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఘోరప్రమాదం జరిగింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడ వారధి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వెళ్లే మార్గంలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద పిల్లర్లపై దిమ్మెలు ఏర్పాటు చేస్తుండగా అది పక్కకు ఒరిగింది. దీంతో దిమ్మెలతో పాటు, యంత్రాలు కూడా పడిపోయాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. కాగా ఘటనలో ఎవరీ గాయాలు కాకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ సాయంతో దిమ్మెలను ఎక్కిస్తున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేపడతామని టీటీడీ ప్రకటించింది.

  రూ.684 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గరుడ వారధిని నిర్మిస్తోంది. ఇందులో టీటీడీ వాటా రూ.450 కోట్లు కాగా.., మిగిలిన మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేస్తోంది. స్మార్ట్ సిటీ ఫేజ్-1 పనుల్లో భాగంగా ఈ నిధులు ఖర్చు చేస్తోంది. 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన గరుడ వారధి ఫ్లై ఓవర్ ను రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే నిధుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను చేపట్టిన AFCON కంపెనీ తొలిదశలో భాగంగా పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం రెండో దశలో భాగంగా కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటు కొనసాగుతోంది.

  తొలిదశ పనుల్లో భాగంగా చేపట్టిన పిల్లర్ల నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి బాధ్యత పూర్తిగా టీటీడీ తీసుకోవాల్సి ఉంది. ఐతే కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుమల ఆదాయం బాగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం ఫ్లై ఓవర్ నిర్మాణంపై పడింది. ఇటీవలే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.50కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

  ఐతే ఈలోగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఫ్లై ఓవర్ నిర్మాణం రెండేళ్లలో పూర్తికావాల్సి ఉండగా.., మరో నెలలో గడువు తీరిపోనుంది. గడువులోగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో మరో ఆరునెలలు గడువు పొడిగించే అవకాశముంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Accident, Andhra Pradesh, Andhra pradesh news, Tirumala, Tirumala news, Tirumala Temple, Tirupati, Ttd

  ఉత్తమ కథలు